ETV Bharat / city

కొవిడ్ బారిన పడిన జర్నలిస్టులకు చేయూత

రెండో దశ కరోనా విజృంభణతో ఎంతో మంది జర్నలిస్టులు మహమ్మారి బారిన పడుతున్నారు. వారందరిని ఆదుకోవడానికి స్వచ్ఛంద సంస్థలు తమ వంతు సాయాన్ని అందిస్తున్నాయి.

help to covid infected journalists, help to journalists
జర్నలిస్టులకు చేయూత, జర్నలిస్టులకు సాయం
author img

By

Published : May 24, 2021, 1:03 PM IST

కరోనా మహమ్మారి రెండోదశ విజృంభన నేపథ్యంలో విలేకరులకు స్వచ్ఛంద సంస్థలు తమ వంతు సాయాన్ని అందించాయి. శ్రీ సాయి శాంతి సహాయ సేవా సమితి హైదరాబాద్ కూకట్​పల్లిలోని త్యాగరాయ గానసభలో లాలన వెల్ఫేర్ ఆర్గనైజేషన్ సౌజన్యంతో సాంస్కృతిక విలేకరులకు, ఫొటోగ్రాఫర్లకు దాదాపు 10 రకాల నిత్యావసర సరకులను ఆయా సంస్థల అధ్యక్షులు డాక్టర్ పూర్ణ శాంతి గుప్తా, మాధవిలు అందజేశారు.

లాక్​డౌన్, కరోనా మహమ్మారి నేపథ్యంలో సమాజంలోని అన్ని వర్గాల ప్రజల కష్ట సుఖాలకు పాత్రికేయులు అందిస్తున్న సేవలు చిరస్మరణీయమని అన్నారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ సమాజ హితానికి పాటుపడే విలేకరులను మానవతా దృక్పథంతో అందరూ గౌరవించాలని ఆమె పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.