హైదరాబాద్ మెడికల్ హబ్‌గా మారుతోందని కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో అత్యాధునిక బ్రెయిన్ అండ్ స్పైన్ సూట్‌ను లాంఛనంగా ప్రారంభించారు. నూతన సాంకేతికతను అందిపుచ్చుకొని మెరుగైన వైద్యసేవలందించేందుకు అపోలో ఆస్పత్రి ఎల్లప్పుడూ ముందుంటుందని కిషన్‌రెడ్డి అన్నారు.
అడ్వాన్స్ ఎంఆర్ఐ మెదడు, వెన్నుముక చికిత్సలో మెరుగైన ఫలితాలకు దోహదపడుతుందని అపోలో ఆసుపత్రి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి వెల్లడించారు. ఆసుపత్రులు, రోగులకు ఫ్రెండ్లీ పాలసీతో కేంద్రం ముందుకు రావాలని.. ఆయుష్మాన్ భారత్ కింద ప్రైవేటు ఆసుపత్రులకిచ్చే వైద్య ఖర్చులు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు.