ETV Bharat / city

నేటి నుంచి దేశవ్యాప్తంగా పది కొత్త విధానాలు అమలు

దేశంలో పది రకాల కొత్త నియమాలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి. మోటారు వాహన నియమాలు దగ్గర నుంచి ఉజ్వల పథకం, ఆరోగ్య బీమా, క్రెడిట్, డెబిట్ కార్డు వరకు మారనున్నాయి. మీరు వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ కథనం చదవాల్సిందే..

new ten rule implementation national wide today on wards
నేటి నుంచి దేశవ్యాప్తంగా పది కొత్త విధానాలు అమలు
author img

By

Published : Oct 1, 2020, 6:24 AM IST

వివిధ శాఖల విధానాల్లో చేసిన మార్పులు ఇవాళ్టీ నుంచి అమలులోకి రానున్నాయి. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ లాంటి పత్రాలను చూపించాల్సిన పనిలేదు. డ్రైవింగ్ చేసేటప్పుడు ఆర్‌సీ, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి పత్రాల కాపీలను వెంట ఉంచుకోవాల్సిన విధానానికి నిన్నటితో శుభం కార్డు పడింది. ఇకపై వాహనాలకు సంబంధించిన పత్రాల సాఫ్ట్ కాపీ రూపంలో ఉంటే సరిపోతుంది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ మోటారు వాహనాల నిబంధనలు-1989లో చేసిన పలు సవరణలతో ఈ నియమాలు అమలులోకి వచ్చాయి. ఇక కొత్త ప్రదేశాలకు వెళ్ళేవారు దారి తెలుసుకోడానికి రూట్ నావిగేషన్ కోసం మొబైల్ ఫోన్లు వాడుకొనే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవర్ ఏకాగ్రతకు భంగం కలిగించని రీతిలో రూట్ నావిగేషన్ కోసం మొబైల్‌ను ఉపయోగించవచ్చని కేంద్రం స్పష్టం చేసింది.

ఇక నుంచి ఉజ్వల ఉండదు..

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన-పీఎంయువై కింద పేదలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ పొందే అవకాశం నిన్నటితో ముగిసింది. ఆ మేరకు కేంద్ర మంత్రి మండలి ఇది వరకే ఆమోదం తెలిపింది. ఇకపై ఏ ఒక్కరు పీఎంయువై కింద ఉచిత వంట గ్యాస్ సిలిండర్లను పొందలేరు. విదేశాలకు నిధుల బదిలీలపై 5శాతం పన్ను భారం పడనుంది. ఇకపై స్వీట్ అమ్మకందారులు గరిష్ట కాలపరిమితికి చెందిన తేదీని ప్రదర్శించాల్సి ఉంటుంది. షాపుల్లో విడిగా లభించే స్వీట్లు ఎప్పటి లోపు తినాలో స్పష్టం చెయ్యాల్సి ఉంటుంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా-ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ దుకాణదారులను ఈ మేరకు ఆదేశించింది. కొత్త ఆరోగ్య బీమా నియమాల అమలు కూడా అమలులోకి రానున్నాయి. విదేశాల నుంచి టెలివిజన్ సెట్లు కొనడం ఇకపై భారం కానుంది. ఓపెన్ సెల్ ప్యానెల్ల దిగుమతిపై 5 శాతం సుంకాన్ని విధించనుంది. 'ఆత్మనిర్భర్​ భారత్'లో భాగంగా... దిగుమతులను తగ్గించేందుకు, దేశీయ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

ఆన్‌లైన్‌ లావాదేవీలపై ఆంక్షలు

రోజు రోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాలను దృష్టిలో ఉంచుకుని, అడ్డుకట్ట వేయడానికి భారతీయ రిజర్వ్ బ్యాంకు సరికొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఆన్‌లైన్ లావాదేవీలు, కార్డు చెల్లింపులను సురక్షితం చేసేందుకే ఆర్​బీఐ కొత్త మార్గదర్శకాలు కూడా అమలులోకి రానున్నాయి. డెబిట్, క్రెడిట్ కార్డులు క్లోనింగ్ చేసి బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బు దోచుకుంటున్న ఘటనల దృష్ట్యా...లావాదేవీలపై ఆర్​బీఐ ఆంక్షలు విధించింది. కార్డుదారుడు కోరుకుంటే తప్ప అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలు కార్డుల ద్వారా చెయ్యడానికి వీల్లేదని స్పష్టం చేసింది. దేశం అంతా డిజిటల్ లావాదేవీల్లో ముందుకు వెళుతున్న ఈ తరుణంలో ఆర్థిక సైబర్ నేరాల కట్టడికి ఈ చర్యలు దోహదం చేస్తాయని ఆర్​బీఐ పేర్కొంది.

డెబిట్, క్రెడిట్ కార్డులను ఏటీఎంలు, పాయింట్ ఆఫ్ సేల్ వద్ద మాత్రమే లావాదేవీలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. డెబిట్, క్రెడిట్... రెండింటిలో కార్డ్ హోల్డర్లు లావాదేవీల పరిమితిని విధించుకోడానికి కొత్తగా అవకాశం కల్పించింది. ఏటీఎం, పీవోస్, ఇ-కామర్స్ కోసం క్రెడిట్-డెబిట్ కార్డులు వాడుకోడానికి ఒక దానిని మాత్రమే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఆన్‌లైన్‌, కాంటాక్ట్‌లెస్ లావాదేవీలు లేని అనని డెబిట్, క్రెడిట్ కార్డులను రద్దు చేయాలని బ్యాంకులకు, కార్డులు జారీ చేసే సంస్థలకు ఆర్బీఐ ఆదేశాలిచ్చింది.

ఆవ నూనె కలపొద్దు, ఈకామర్స్​పై ఐటీ నిఘా

ఆవ నూనెను ఇతర వంట నూనెల్లో కలపడంపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిషేధించింది. దీనిని ఇవాళ్టి నుంచి అమలు చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆహార భద్రత కమిషనర్లకు లేఖలు రాసింది. ఈ కామర్స్ ద్వారా జరిగే లావాదేవీల్లో టాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ విధానంపై ఆదాయపు శాఖ జారీ చేసిన మార్గదర్శకాలు కూడా అమలులోకి వస్తాయి.

ఇదీ చూడండి: 'మరోసారి తెలంగాణ జోలికి రాకుండా సమాధానం ఇవ్వాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.