ETV Bharat / city

కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాల చెల్లింపునకు ప్రభుత్వ కార్యాచరణ

author img

By

Published : Jan 20, 2022, 5:00 PM IST

PRC issue in AP: కొత్త పీఆర్సీ ప్రకారమే ఉద్యోగుల జీతాల చెల్లింపులు చేపట్టాలని ఏపీ ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుంది. పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగులు నిరసన బాట పట్టినా తీరు మార్చుకోవడం లేదు. ఈ మేరకు జీతాల చెల్లింపునకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ సిద్ధం చేసింది.

PRC issue in AP
ఏపీలో పీఆర్సీ ఆందోళనలు

PRC issue in AP: ఓ వైపు పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు ఆందోళన బాట పట్టినా ప్రభుత్వం ఏ మాత్రం వెనక్కి తగ్గడంలేదు. కొత్త పీఆర్సీ ప్రకారమే ఉద్యోగులకు జీతాల చెల్లింపునకు కార్యాచరణ చేపట్టింది. ఈ మేరకు ప్రభుత్వం ట్రెజరీ కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. సవరించిన పే స్కేల్స్‌ ఆధారంగా ఉద్యోగుల జీతాల్లో మార్పులు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో జీతాల చెల్లింపునకు సీఎఫ్ఎంఎస్ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేసింది.

సమ్మె బాట పడతారా.?

పీఆర్సీ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఇప్పటికే ఉద్యోగుల ఆందోళనలు ఉద్ధృతం చేశారు. నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతున్న ఉద్యోగులు చివరి అస్త్రంగా సమ్మెకు వెళ్లాలని నిర్ణయించారు. నిబంధనల ప్రకారం 14 రోజుల ముందు ఇవ్వాల్సిన సమ్మె నోటీసును.. శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మకు ఇవ్వనున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ముట్టడికి యత్నం

మరోవైపు ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) పిలుపు మేరకు ఉపాధ్యాయులు ఈ రోజు జిల్లాల కలెక్టరేట్లను ముట్టడించేందుకు యత్నించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ నిరసనలు కొనసాగించారు. పీఆర్సీ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలనే డిమాండ్‌తో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు ఈ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పలుచోట్ల ఉపాధ్యాయ సంఘాల నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్‌ చేశారు.

ఇదీచదవండి: Ministers Review On Covid: రాష్ట్రవ్యాప్తంగా రేపట్నుంచి ఫీవర్ సర్వే: హరీశ్‌ రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.