రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,47,284 కు చేరింది. కొత్తగా 1,602 కరోనా కేసులు నమోదవగా... నలుగురు మరణించారు. కరోనా బారినపడి ఇప్పటివరకు 1,366 మంది మృతి చెందారు. కొవిడ్ నుంచి తాజాగా 982 మంది బాధితులు కోలుకోగా... వారి సంఖ్య 2,26,646 కి చేరింది.
రాష్ట్రంలో ప్రస్తుతం 19,272 కరోనా యాక్టివ్ కేసులున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 16,522 మంది బాధితులున్నట్లు వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 295 కరోనా కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ప్రభుత్వ భూములను కబ్జా చేస్తూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్