రాష్ట్రంలో ఇవాళ 51 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో 37 కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. మరో 14 మంది వలదారులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు పేర్కొంది. మొత్తం పాజిటివ్ కేసులు 1326 కి చేరాయి. ఇవాళ 21 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు కోలుకున్న మొత్తం సంఖ్య 822కి చేరింది.
ప్రస్తుతం రాష్ట్రంలో 472 మందికి కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 32 మంది మృతి చెందారు.