Samantha's question hour in Instagram: నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత.. ఫుల్ బిజీగా మారిపోయింది. వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. 'పుష్ప' సినిమాలో 'ఊ అంటవా..' సాంగ్‌తో ఇటీవల సెన్సేషన్ సృష్టించింది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఉన్నాయి. అయితే తాజాగా ఇన్‌స్టాలో క్వశ్చన్ అవర్ నిర్వహించిన సామ్‌కు ఓ నెటిజన్ ఎవరూ అడగకూడని ప్రశ్న అడిగేశాడు. దీనిపై సమంత ఘాటుగా స్పందించింది.
ఇన్‌స్టాలో క్వశ్చన్ అవర్ నిర్వహించిన సామ్.. నెటిజన్లను ప్రశ్నలు అడగమని కోరింది. ఇంక అంతే ఓ నెటిజన్ రెచ్చిపోయాడు. 'మీరు ప్రెగ్నెంటా? కాకపోతే.. నేను ప్రెగ్నెంట్‌ను చేస్తా' అంటూ అసభ్యంగా కామెంట్ చేశాడు. ఈ వ్యాఖ్యలపై సీరియస్ అయిన సామ్.. 'రీప్రొడ్యూస్' అనే పదాన్ని ఎక్కడ ఎలా వాడాలో మొదట తెలుసుకో నువ్వు అంటూ కౌంటర్ ఇచ్చింది.
ఇదీ చూడండి: భీమ్లా నాయక్ ట్రైలర్ అదిరింది.. సినిమా రిలీజ్ వరకు రచ్చ రచ్చే