ఓవైపు క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ, మరోవైపు దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి చాణక్యపురి మంజిరా గ్రాండ్ అపార్ట్మెంట్ సెల్లారులో ఉన్న మహిళను బెదిరించి.. మెడలో నుంచి 4 తులాల బంగారు గొలుసును సోక్కం రవికుమార్ అనే వ్యక్తి అపహరించాడు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు.
ఇవీ చూడండి: నయీం కేసులో పోలీసు అధికారులకు క్లీన్చిట్