ఆంధ్రప్రదేశ్ గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసుపై వాస్తవాలు తెలుసుకునేందుకు జాతీయ ఎస్సీ కమిషన్ బృందం గుంటూరులో పర్యటించింది. వీరిలో కమిషన్ వైస్ ఛైర్మన్ హల్దార్, సభ్యులు అంజుబాల, సుభాష్ పార్థి ఉన్నారు. రమ్య కుటుంబ సభ్యులను బృంద సభ్యులు కలిశారు. ఘటన వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
దాడుల గురించి వివరించాం: తెదేపా
యువతి రమ్య ఘటనపై విచారణ జరపడానికి వచ్చిన జాతీయ ఎస్సీ కమిషన్‌ను తెదేపా బృందం కలిసింది. రమ్య హత్య విషయమై సీనియర్ నేతలు నక్కా ఆనంద్‌బాబు, వర్ల రామయ్య, శ్రావణ్‌కుమార్.. కమిషన్ అధికారులను విజయవాడలో కలిశారు. ఈ ఘటనతో పాటు ఏపీలో దళితులపై జరిగిన దాడులను వారికి వివరించారు. ఈ ఘటనలను సవివరంగా వింటామన్న కమిషన్.. సాయంత్రం 5.30 గంటలకు తెదేపా నేతలకు అపాయింట్‌మెంట్ ఇచ్చింది.
'జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్, సభ్యులను ఒక్క నిమిషమే కలిశాం. ఏపీలో దళితులపై జరిగిన దాడుల వివరాల బుక్‌లెట్ చూపించాం. సాయంత్రం 5.30 గంటలకు రమ్మని మాకు చెప్పారు. సాయంత్రం సీఎం, గవర్నర్ వస్తారని.. అనుమతి లేదని పోలీసులు అంటున్నారు. ఎస్సీ కమిషన్‌ను కలవకుండా అధికారులు పక్కదారి పట్టించారు'
- తెదేపా నేతల బృందం
గుంటూరులో రమ్య కుటుంబాన్ని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు పరామర్శించారు. వారితో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. అనంతరం రమ్య చిత్రపటానికి నివాళులు అర్పించారు. జాతీయ ఎస్సీ కమిషన్ బృందాన్ని కలిసేందుకు భాజపా మహిళా మోర్చా నాయకులు ప్రయత్నించగా... పోలీసులు వారిని అడ్డుకున్నారు. భాజపా మహిళా నాయకులను రమ్య ఇంటి వైపు వెళ్లనివ్వలేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తంచేసిన భాజపా నేత సాదినేని యామిని.. కమిషన్‌ను కలిస్తే అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. పోలీసుల చర్యను నిరసిస్తూ రోడ్డుపైనే బైఠాయించారు. ఈ క్రమంలో రమ్య ఇంటివద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
ఇవీ చదవండి: