రాష్ట్రంలో మైనార్టీ విద్యార్థులకు అందిస్తున్న విద్యావిధానంపై జాతీయ మైనారిటీ కమిషన్ వైస్ ఛైర్మన్ అతీఫ్ రషీద్ సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రప్రభుత్వాన్ని, అధికారులను ఆయన ప్రశంసించారు. హైదరాబాద్ బహదూర్‌పురాలోని మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాలల్లోని తరగతి గదులు, వంట గది, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు దేశానికే ఆదర్శమని... ఆ పాఠశాలల రాష్ట్ర కార్యదర్శి షఫీ ఉల్లా పేర్కొన్నారు. మైనార్టీ విద్యార్థులకు అందిస్తున్న విద్యా విధానాన్ని అతీఫ్ రషీద్‌కు ఆయన వివరించారు.
ఇదీ చదవండి: 'ఉద్యోగాలివ్వండి.. లేదంటే కారుణ్య మరణాలకు అనుమతివ్వండి'