ప్రతి ఒక్కరు చేనేత వస్త్రాలు ధరించి ఆ రంగంపై ఆధారపడిన కార్మికులను ప్రోత్సహించాలని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్, లాక్మే ఫ్యాషన్ వీక్ ఆధ్వర్యంలో హైదరాబాద్ బంజారాహిల్స్లో చేనేత పరిశ్రమ పరిస్థితి, భవిష్యత్ అభివృద్ధి కోసం తీసుకోవాల్సి చర్యలపై పలువురు ప్రముఖ డిజైనర్లతో చర్చా వేదిక ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, ప్రముఖ డిజైనర్, మోడల్ శిల్పారెడ్డి పాల్గొన్నారు. నేటి యువతరం మెచ్చే విధంగా చేనేత వస్త్రాలను డిజైన్ చేసి అందించడం వల్ల చేనేత వస్త్రాలకు ఆదరణ పెరుగుతుందని శిల్పారెడ్డి అన్నారు. ఆ దిశగా ప్రభుత్వం, డిజైనర్లు కృషి చేస్తున్నారని వెల్లడించారు.
- ఇదీ చూడండి : ఇకపై వ్యవసాయానికే వ్యవసాయ రుణాలు