ETV Bharat / city

'మహిళా భద్రతలో తెలంగాణ పోలీసుల పనితీరు భేష్'

author img

By

Published : Feb 16, 2021, 7:23 PM IST

మహిళా భద్రతలో తెలంగాణ పోలీసుల పనితీరు బాగుందని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు రాజుల్బెన్ దేశాయ్ ప్రశంసించారు. రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలు, భాగ్యనగరంలోని షీటీమ్స్, భరోసా, సఖి కేంద్రాలను సందర్శించారు.

national-commission-for-women-member-rajulben-desai-praised-telangana-police
తెలంగాణ పోలీసుల పనితీరు భేష్

దేశంలో మహిళల రక్షణకు కేంద్ర సర్కార్​తో పాటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు రాజుల్బెన్ దేశాయ్ అన్నారు. తెలంగాణలో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాల విషయాల్లో పోలీసులు తీసుకుంటున్న చర్యల గురించి డీజీపీ మహేందర్​ రెడ్డి నుంచి తెలుసుకున్నట్లు చెప్పారు. ఎక్కువగా గృహహింస, వరకట్న వేధింపులకు సంబంధించిన కేసులు తమ వద్దకు వస్తున్నట్లు వెల్లడించారు.బాధితులకు ఆశ్రయం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సఖి కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు.

తెలంగాణ ప్రభుత్వం తరఫున షీ టీమ్స్, భరోసా కేంద్రాల పనితీరు బాగుందని రాజుల్బెన్ కితాబిచ్చారు. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో విద్యార్థినిలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టేందుకు వారికి శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో అమ్మాయిలపై జరుగుతున్న అరాచకాలు వెలుగులోకి తీసుకురావాలని, అన్ని రకాల చర్యలు తీసుకున్నా ఆడవాళ్లపై ఆకృత్యాలు ఆగడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు అమ్మాయిలు వరకట్నం, లైంగిక వేధింపులు వంటి విషయాల్లో మహిళా కమిషన్​ను సంప్రదించాలని కోరారు. ఇప్పటివరకు 2019లో 52 కేసులు, 2020లో 124 కేసులు , 2021లో పది కేసుల వరకూ పెండింగ్​లో ఉన్నాయని వెంటనే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.