Narayana remand report : నారాయణ విద్యా సంస్థల వ్యవస్థాపకుడు నారాయణను మంగళవారం అరెస్టు చేశారు. ఆయనకు రిమాండు విధించాలంటూ చిత్తూరు నాలుగో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో పోలీసులు రిమాండు రిపోర్టు దాఖలు చేశారు.
‘నారాయణ విద్యా సంస్థల వ్యవస్థాపకుడు పి.నారాయణ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మాజీ మంత్రి. ఫిర్యాదుదారును, సాక్షుల్ని ప్రభావితం చేయగలరు. రాజకీయ పలుకుబడితో సాక్ష్యాల్ని ట్యాంపర్ చేయకుండా నిరోధించేందుకు ఆయనకు జ్యుడిషియల్ రిమాండు విధించాలి’.
- చిత్తూరు జిల్లా పోలీసుల రిమాండ్ రిపోర్టు
ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయని.. నారాయణను స్వేచ్ఛగా తిరగనిస్తే ఆ పరీక్షల్లోనూ మాల్‌ప్రాక్టీసుకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని వివరించారు. అదే జరిగితే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని వేల మంది విద్యార్థుల భవిష్యత్ నాశనమైపోతుందన్నారు.
తప్పుల తడక : నారాయణ ఏపీ విద్యాశాఖ మంత్రిగా ఎప్పుడూ పని చేయలేదు. గత ప్రభుత్వ హయాంలో ఆయన పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రిగా పని చేశారు. అయినా ఆయనను విద్యాశాఖ మాజీ మంత్రి అంటూ రిమాండు రిపోర్టులో తప్పుగా రాయటం కొసమెరుపు.
ఇదీ చదవండి : మాజీ మంత్రి నారాయణ అరెస్ట్