ETV Bharat / city

Nara lokesh: ప్రజల దృష్టి మరల్చేందుకే కొత్త జిల్లాల డ్రామా: నారా లోకేశ్ - ఏపీలో కొత్త జిల్లాలో ఏర్పాటుపై నారా లోకేశ్​ వ్యాఖ్యలు

Nara Lokesh: మూడు రాజధానులు కావాలంటే రాష్ట్ర విభజన చట్టాన్ని పార్లమెంట్​లో సవరణ చేయాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. ఇదే విషయం కోర్టు చెప్పినా.. ఈ ప్రభుత్వానికి అర్థం కావడం లేదన్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు.

Nara lokesh
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌
author img

By

Published : Mar 24, 2022, 8:07 PM IST

Nara Lokesh:మూడు రాజధానులు కావాలంటే రాష్ట్ర విభజన చట్టానికి పార్లమెంట్ సవరణ చేయాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ స్పష్టం చేశారు. అదే విషయం కోర్టు చెప్పినా.. ఈ ప్రభుత్వానికి అర్థం కావడంలేదన్న లోకేశ్​.. ఈ అంశంలో మాత్రమే శాసనసభలకు అధికారం లేదని చెప్పిందని ఆయన గుర్తుచేశారు. ప్రతి నియోజకవర్గాన్ని జిల్లా చేస్తారా.. 175 నియోజకవర్గాలను జిల్లాలుగా మార్చండని లోకేశ్​ ఎద్దేవా చేశారు. పరిశ్రమలు, కొత్త ఉద్యోగాలు ఇవ్వలేక ప్రజల దృష్టి మరల్చేందుకే కొత్త జిల్లాలు ఏర్పాటు అని లోకేశ్‌ మండిపడ్డారు. కొత్త జిల్లాల వలన ఉపయోగం ఏంటి..? ఒక్క ఉద్యోగం అయినా వస్తుందా? అని ప్రశ్నించారు.

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌

వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత 60 శాతం బ్రాండ్స్ తెచ్చారని.. వాటిలో 140 కొత్త బ్రాండ్స్ తీసుకొచ్చారన్నారు. వైకాపా బ్రాండ్స్ కాబట్టే అవి మూయలేదని.. అన్నక్యాంటీన్, చంద్రన్న భీమా లాంటి చంద్రబాబు పథకాలను మాత్రమే మూసేశారని చాలా స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. పరిపాలన ఒకే చోట ఉండాలి.. అభివృద్ధి వికేంద్రీకరణ కావాలనేది చంద్రబాబు నినాదమని లోకేశ్‌ పేర్కొన్నారు. మూడు సంవత్సరాల్లో ఒక్క పరిశ్రమ తీసుకొచ్చారా అని నిలదీశారు. చిన్న జిల్లాలు చేస్తే అభివృద్ధి అవుతుందా అని ప్రశ్నించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.