ప్రజల హక్కులను కాపాడలేని ఎంపీలు ఎంతమంది ఉంటే ఏం లాభమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. విశాఖ ఉక్కుని తుక్కులా కొట్టేయడానికి జగన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా.. వాటిని భగ్నం చేసేందుకు ఎంత దూరమైనా వెళ్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి అన్నీ చెప్పటంతోపాటు, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అంగీకారంతోనే విశాఖ ఉక్కు అమ్మకం ప్రక్రియ జరుగుతోందని కేంద్రం స్పష్టం చేసిందని లోకేశ్ ధ్వజమెత్తారు.
జగన్ దిల్లీ పర్యటన కేసుల మాఫీ కోసమే: గోరంట్ల
ఈ నేపథ్యంలోనే జగన్ దిల్లీ పర్యటన కేసుల మాఫీ కోసమేనని అర్థమవుతోందని ఏపీ తెదేపా నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. 'రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన పోలవరం పెండింగ్ బకాయిలపై ఎలాంటి వినతిపత్రం అందలేదని రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. కేంద్రాన్ని ప్రశ్నించామనేది సాక్షిలో తప్ప.. ఎక్కడా కనిపించదు. ఇంతకీ దిల్లీ వెళ్లేది దేనికో అర్థం కావట్లేదు." అని గోరంట్ల ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: హింస అరికట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి కిషన్‌రెడ్డి డిమాండ్