ETV Bharat / city

ఏపీ సీఎం జగన్​కు చుక్కెదురు... హాజరు కావాల్సిందే! - jagan court

ఏపీ సీఎం జగన్​కు చుక్కెదురు
author img

By

Published : Nov 1, 2019, 10:58 AM IST

Updated : Nov 1, 2019, 7:28 PM IST

10:55 November 01

ఏపీ సీఎం జగన్​కు చుక్కెదురు... హాజరు కావాల్సిందే!

అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న  ఏపీ ముఖ్యమంత్రి జగన్ పిటిషన్‌ను హైదరాబాద్​లోని నాంపల్లి సీబీఐ కోర్టు కొట్టివేసింది. ప్రతీ శుక్రవారం విచారణకు తన బదులుగా న్యాయవాది హాజరయ్యేలా అనుమతి ఇవ్వాలని జగన్ న్యాయస్థానాన్ని కోరారు. రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రిగా కీలకమైన బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉన్నందున వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. దీనికి న్యాయస్థానం అంగీకరించలేదు.

 విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చి కోర్టుకు హాజరు కావడానికి సుమారు రెండు రోజులు పడుతోందని... రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా తానూ ఎక్కువ సమయం ఏపీలో కేటాయించాల్సి ఉందన్నారు. జగన్ అభ్యర్థనపై సీబీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పటికే కేసుల విచారణను జాప్యం చేస్తున్నారని... వ్యక్తిగత హాజరు మినహాయింపునిస్తే.. మరింత ఆలస్యం జరుగుతుందని పేర్కొంది. సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని తెలిపింది. చట్టం ముందు అందరూ సమానులేనని... సీఎం అయినంత మాత్రాన వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వొద్దని సీబీఐ వాదించింది. 

గతంలో ఇదే అభ్యర్థనపై జగన్ దాఖలు చేసిన పిటిషన్​ను హైకోర్టు కొట్టివేసినందున... సీబీఐ కోర్టుకు విచారణ జరిపే పరిధి లేదని సీబీఐ పేర్కొంది. ఇరువైపుల వాదనలు విన్న నాంపల్లి సీబీఐ కోర్టు... జగన్‌ అభ్యర్థనను తిరస్కరిస్తూ తీర్పునిచ్చింది.

Last Updated : Nov 1, 2019, 7:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.