ETV Bharat / city

Nagula Chavithi in Hyderabad : సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మానసాదేవీలకు కానుకగా వెండి కిరీటాలు - నాగుల చవితి ప్రత్యేకత

పుట్టకు పూజ చేసే పండుగ.. నాగుల చవితి
పుట్టకు పూజ చేసే పండుగ.. నాగుల చవితి
author img

By

Published : Nov 8, 2021, 11:30 AM IST

Updated : Nov 8, 2021, 11:56 AM IST

10:33 November 08

nagula chavithi in Hyderabad : పుట్టకు పూజ చేసే పండుగ.. నాగుల చవితి

పుట్టకు పూజ చేసే పండుగ.. నాగుల చవితి

నేడు నాగుల చవితి(Nagula Chavithi 2021) సందర్భంగా మహిళలు తెల్లవారుజామునే పాముపుట్టల వద్దకు తరలివెళ్లారు. నగరాల్లో పుట్టలు దొరకడం అరుదు కాబట్టి ఆలయాల్లో నాగదేవత, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు చేస్తారు. హైదరాబాద్​ వనస్థలిపురం శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో తెల్లవారుజాము నుంచే నాగుల చవితి సందర్భంగా భక్తులు పోటెత్తారు. పంచామృత అభిషేకాలతో సర్ప సూక్తం హోమం నిర్వహించారు. కార్తికేయునికి ప్రీతికరమైన నాగుల చవితి రోజున స్థానిక వర్తకుడు మాలే రవికుమార్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మానసాదేవిలకు వెండి కిరీటాలను కానుకగా సమర్పించారు. 

దంపతులకు సంతానం కలగకపోవడానికి ప్రాచీన, ఆధునిక వైద్యశాస్త్రాలు పలు కారణాలు చెబుతాయి. సర్పదోషమే కారణమని భావించినవారు రామేశ్వరం వెళ్లి నాగప్రతిష్ఠ చేయడం రివాజు. అక్కడికి వెళ్లలేనివారు తమ గ్రామ దేవాలయ ప్రాంగణంలోనే సర్ప విగ్రహాల్ని ప్రతిష్ఠించే పద్ధతి ఉంది. మన ప్రాచీన దేవాలయాల చుట్టూ శిథిలమైన నాగ విగ్రహాలు ఇప్పటికీ దర్శనమిస్తుంటాయి.

పుట్ట వల్ల భూమిలో తేమ పెరుగుతుంది. పంటలకు ఇది ఎంతో అవసరం. పంటలకు మూలం పాములే కాబట్టి, రైతులు వాటిని దేవతలుగా భావిస్తుంటారు. పంటలు ఏపుగా పెరిగే కాలంలో ‘కార్తిక శుద్ధ చవితి(Karthika masam 2021)’నాడు మనం ‘నాగుల చవితి’ని పర్వదినంగా ఆచరిస్తున్నాం.

కద్రువ నాగ మాత. మహావిష్ణువుకు శయ్యగా అమరిన ప్రాణి ఆదిశేషువు. సర్పం పరమశివుడి కంఠాన మనోహర ఆభరణం. సూర్యభగవానుడి రథానికి సర్పమే పగ్గం. అదే- ఆకాశం మధ్య వెలసిన కుజగ్రహానికి కుదురు. భైరవుడి భుజంపై వేలాడే యజ్ఞోపవీతం సర్పమే. శనిదేవుడి చేతిలోని ఆయుధమూ అదే. సర్పమే మంథర పర్వతానికి కవ్వపు తాడుగా మారింది. దేవతలకు, రాక్షసులకు సముద్ర మథన సమయంలో సహాయకారిగా ఉపయోగపడింది. పురాణాల్లో సర్పానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందుకే నాగదేవత శ్రావణ, కార్తిక మాసాల్లో(Karthika masam) ప్రత్యేక పూజలందుకుంటోంది. నాగదేవతను పూజించే సత్సంప్రదాయం భారత్​తో పాటు జపాన్‌, చైనా, గ్రీకు దేశాలకూ వ్యాపించింది. 

Last Updated : Nov 8, 2021, 11:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.