ETV Bharat / city

గొడవ ఆపేందుకు వెళ్లిన వ్యక్తి హత్య - Hyderabad Murder Latest News

సికింద్రాబాద్​ మారేడుపల్లి పీఎస్​ పరిధిలో దారుణం జరిగింది. ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవను ఆపేందుకు వెళ్లిన వ్యక్తి హత్యకు గురయ్యాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గొడవ ఆపేందుకు వెళ్లిన వ్యక్తి హత్య
author img

By

Published : Nov 3, 2019, 11:21 AM IST

ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవను ఆపేందుకు... వెళ్లిన వ్యక్తి హత్యకు గురైన ఘటన సికింద్రాబాద్​ మారేడుపల్లి పీఎస్​ పరిధిలో చోటు చేసుకుంది. నిన్న రాత్రి నవీన్ గౌడ్, చోటు అనే ఇద్దరు వ్యక్తుల మధ్య వాగ్వాదం జరిగింది. ఇది గమనించిన నవీన్​ గౌడ్​ మామ రమేశ్ గౌడ్ సర్ది చెప్పేందుకు వెళ్లాడు. ఈ సమయంలో చోటు అనే వ్యక్తి రమేశ్​​ను బలంగా కొట్టడం వల్ల అక్కడిక్కడే కుప్పకూలాడు. స్థానికులు వెంటనే దగ్గర్లోని ప్రైవేట్​ ఆస్పత్రికి తరలించారు.

బాధితుడు చికిత్సపొందుతూ అర్ధరాత్రి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: రాష్ట్ర ప్రజారవాణా వ్యవస్థలో సరికొత్త అంకం

TG_HYD_15_03_GODAVA_DEATH_AV_3181326 రిపోర్టర్-శ్రీకాంత్ నోట్- ఫీడ్ డెస్క్ వాట్సాప్ కు వచ్చింది. ( ) సికింద్రాబాద్ మారేడ్ పల్లి పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. ఇద్దరు వ్యక్తులు మధ్య జరిగిన పాతకక్షల గొడవలో ఆపడానికి వెళ్లిన ఇంకో వ్యక్తి చనిపోయాడు. మారెడ్ పల్లిలో నివాసముంటున్న నవీన్ అనే వ్యక్తికి అదే ప్రాంతానికి చెందిన చోటు అనే అతనికి చిన్న గొడవ జరిగింది. మాటా మాటా పెరిగి రోడ్డుమీదే చేయి చేసుకున్నారు. ఆ సమయంలో అటు వైపుగా వెళ్తున్న నవీన్ గొడవను చూశాడు. తన అల్లుడు నవీన్ తో వేరే వ్యక్తి గొడవ పడుతుండటంతో రమేశ్ ఆపే ప్రయత్నం చేశాడు. తాగిన మైకంలో ఉన్న చోటు మధ్యలో వచ్చిన రమేశ్ పై దాడి చేసి బలంగా అతని గుండెపై చేతితో కొట్టడంతో నొప్పితో విలవిలాడాడు. దగ్గరలోనే ఉన్న ఇంటికి చేరుకుని ఒక్కసారిగా ఇంటి వద్దే కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే రమేష్ కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారమిచ్చి దగ్గరలో ఉన్న యశోద హస్పిటల్ కు తరలించారు. మార్గమధ్యలోనే చనిపోయినట్లు చెప్పారు డాక్టర్లు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు పోలీసులు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హస్పిటల్ కు తరలించారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.