ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లెలో మూఢ విశ్వాసంతో కన్న కుమార్తెలను కడతేర్చిన పురుషోత్తం, పద్మజలను.. విశాఖ మానసిక వైద్యశాల నుంచి మదనపల్లె సబ్ జైలుకు తరలించారు. సాయుధ పోలీసు రక్షణతో ప్రత్యేక వాహనంలో నిందితులను.. వైద్యశాల అధికారులు తీసుకొచ్చారు. మదనపల్లె సబ్‌జైలు అధికారులకు అప్పజెప్పారు.
ఉన్నత చదువులు చదవి.. మూఢ విశ్వాసంతో కన్నబిడ్డలను అతి కిరాతకంగా చంపిన కేసులో పురుషోత్తం, పద్మజలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి మానసిక పరిస్థితి సరిగా లేక ఈ దారుణానికి పాల్పడ్డారని పేర్కొన్న అధికారులు.. నిందితులకు విశాఖలోని మానసిక వైద్య శాలలో చికిత్సను అందించారు. అనంతరం వారిని మదనపల్లె సబ్ జైలుకు తరలించారు.
ఇవీ చూడండి: కోర్టులో యుగతులసి ఫౌండేషన్ హౌస్ మోషన్ పిటిషన్