ETV Bharat / city

మునుగోడు ఉపఎన్నికకు మోగిన నగారా.. తక్షణమే అమల్లోకి ఎన్నికల నియమావళి - మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల

munugode
munugode
author img

By

Published : Oct 3, 2022, 12:01 PM IST

Updated : Oct 3, 2022, 1:42 PM IST

11:58 October 03

మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల

Munugode Bypoll Schedule: మునుగోడు ఉపఎన్నికల నగారా మోగింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఏర్పడిన శాసనసభ స్థానానికి ఉపఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 7న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ రోజు నుంచి ఈ నెల 14 వరకు నామపత్రాలు స్వీకరిస్తారు. 15న పరిశీలన ఉంటుంది. ఈ నెల 17 వరకు ఉప సంహరణకు గడువుంటుంది. వచ్చే నెల మూడో తేదీన ఉప ఎన్నిక పోలింగ్ నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపు 6న చేపడతారు.

2022 జనవరి ఒకటో తేదీ అర్హతగా రూపొందించిన ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తారు. ఈవీఎంల ద్వారా ఓటింగ్ జరగనుండగా.. అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ వీవీప్యాట్ యంత్రాలను వినియోగిస్తారు. ఉప ఎన్నిక షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో మునుగోడు నియోజకవర్గంలో ఉన్న నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఎంసీసీ అమల్లోకి వచ్చింది. మునుగోడు సహా 6 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్​ను ఈసీ ప్రకటించింది.

ఉప ఎన్నికలు జరిగే స్థానాలు (7)

  • తెలంగాణ - మునుగోడు
  • మహారాష్ట్ర - తూర్పు అంధేరి
  • బిహార్‌ - మోకమ
  • బిహార్‌ - గోపాల్‌గంజ్‌
  • హరియాణా - అదంపూర్‌
  • ఉత్తర్‌ప్రదేశ్‌ - గోల గోకర్నాథ్‌
  • ఒడిశా - ధామ్‌నగర్‌

ఇవీ చదవండి:

Last Updated : Oct 3, 2022, 1:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.