ETV Bharat / city

ఏపీ పురపోరు: ముగిసిన ఎన్నికల ప్రచారం - రాష్ట్రంలో ముగిసిన ఎన్నికల ప్రచారం వార్తలు

ఏపీలో పురపాలక ఎన్నికల నేపథ్యంలో గత కొన్ని రోజులుగా అభ్యర్థుల ప్రచారంతో మార్మోగిన నగరాలు, పట్టణాలు ఒక్కసారిగా చల్లబడ్డాయి. ప్రచారం గడువు ముగియగా.. చివరి నిమిషం వరకూ అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. తమకు అవకాశం కల్పించాలంటూ అభ్యర్థించారు.

municipal-election-campaign-ended-in-ap
ఏపీ పురపోరు: ముగిసిన ఎన్నికల ప్రచారం
author img

By

Published : Mar 8, 2021, 9:45 PM IST

ఆంధ్రప్రదేశ్​లో పురపాలక ఎన్నికల వేళ కొన్ని రోజులుగా అభ్యర్థుల ప్రచారంతో మార్మోగిన నగరాలు, పట్టణాల్లో ఒక్కసారిగా ప్రశాంతత నెలకొంది. సాయంత్రం 5 గంటలకు ప్రచారం గడువు ముగియగా.. చివరి నిమిషం వరకూ అభ్యర్థులు హోరాహోరీ ప్రచారం సాగించారు. 12 కార్పొరేషన్లు, 75 పురపాలక, నగర పంచాయతీలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిలో ఏకగ్రీవాలు పోనూ మిగిలిన వాటికి ఎన్నికలు జరగనున్నాయి. హైకోర్టు ఆదేశాలతో ఏలూరు కార్పొరేషన్​లో ఎన్నికలు ఆగిపోయాయి. మిగిలిన 11 కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఈనెల 10న పోలింగ్ జరగనుంది. దీనికోసం అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు.

కార్పొరేషన్లలో 582 డివిజన్లు, మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లోని అన్ని వార్డులు కలిపి మొత్తం 2,215 డివిజన్లు, వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటికోసం 7,915 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 78,71,272 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీటిలో 38,72,264 మంది పురుష ఓటర్లుండగా..39,97,840 మహిళా ఓటర్లు ఉన్నారు.

ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ అధికారులు, రూట్ అధికారులు, జోనల్ అధికారులు, సూక్ష్మ పరిశీలకులను నియమించారు. కార్పొరేషన్లలో 26,835 మంది, మున్సిపాలిటీల్లో 21,888 మంది సిబ్బందిని నియమించనున్నారు. ఈ నెల 10 న పోలింగ్ జరగనుండగా..14న ఓట్ల లెక్కింపు జరగనుంది.

ఇదీ చదవండి: తెలంగాణలో 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' ఉత్సవాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.