ETV Bharat / city

Milan 2022: విశాఖ తీరాన విన్యాసాలు.. మిలాన్​కు సర్వం సిద్ధం

Milan 2022: ఏపీ విశాఖలో సందడి వాతావరణం నెలకొంది. బీచ్ రోడ్‌లో అన్ని ప్రధాన దర్శనీయ స్థలాలను చూపరులకు కనువిందు చేసేట్టుగా తీర్చిదిద్దుతున్నారు. ఈనెల 27న జరిగే అంతర్జాతీయ సిటీ పరేడ్, నౌకాదళ విన్యాసాల కోసం సిద్దమవుతున్న ఈ ఏర్పాట్లు కొత్త సొబగులను అద్దుతోంది.

Milan
Milan
author img

By

Published : Feb 20, 2022, 4:00 PM IST

విశాఖ తీరాన విన్యాసాలు.. మిలాన్​కు సర్వం సిద్ధం

Milan 2022: సోమవారం జరగబోయే ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ.. ఈనెల 27న జరుగనున్న బహుళ దేశాల నేవీ విన్యాసం-మిలన్ 2022 కోసం విశాఖ బీచ్ రోడ్ కొత్త రూపు దిద్దుకుంటోంది. సముద్రంపై జరిగే విన్యాసాలు బీచ్ రో‌డ్‌లో జరిగే పరేడ్‌ను వీక్షించేందుకు వచ్చే వారికి ఈ ప్రాంతమంతా సరికొత్తగా కన్పించనుంది. టీయూ-142 మ్యూజియం, కురుసుర సబ్ మెరైన్ మ్యూజియం, విక్టరీ ఎట్ సీ వంటివే కాకుండా సాగర తీరంలో ప్రతి ఒక్క విగ్రహాన్ని శుభ్రం చేసి అ ప్రాంతమంతా రంగులు అద్ది.. అందంగా తీర్చిదిద్దారు.

రాష్ట్రపతి హాజరు..

President Fleet Review: ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ సందర్భంగా ఆర్కే బీచ్ నుంచి నౌకలు బారులు తీరడాన్ని వీక్షించే వీలుంటుంది. సోమవారం జరగబోయే.. ఫ్లీట్‌ రివ్యూకి రాష్ట్రపతి రామ్​నాథ్‌ కోవింద్ హాజరువుతున్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్‌ సింగ్, గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్ సహా నేవీ చీఫ్, ఇతర రక్షణదళాల ఉన్నతాధికారులు హాజరవుతారు. ఇది పూర్తి సముద్రంపైనే సాగుతుంది.

రెండు దశల్లో నౌకా దళాల విన్యాసం..

బహుళ దేశాల నౌకాదళాల విన్యాసం మిలన్ 2022 రెండు దశలలో జరుగుతుంది. తొలిదశలో నౌకాదళ స్థావరం, ఆర్కే బీచ్‌లో నిర్వహించనున్నారు. ఈనెల 26న అంతర్జాతీయ నౌకా సదస్సుతో ఆరంభమయ్యే మిలన్‌కి.. 40కి పైగా దేశాల నుంచి నౌకాదళ ఉన్నతాధికారులు హాజరవుతున్నారు. 27న ఆర్కే బీచ్‌లో వివిధ నేవీలకు చెందిన బృందాలు పరేడ్ నిర్వహిస్తాయి. ఇందులో భాగంగానే సముద్రంపైనా, గగన తలంలోనూ యుద్ధ విమానాలు, హెలికాఫ్టర్లు విన్యాసాలు చేయనున్నాయి.

ఇదీ చూడండి: Milan 2022: సిటీ ఆఫ్​ డెస్టినీలో మిలాన్ 2022 ఉత్సవం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.