ETV Bharat / city

సీఎం జగన్ బెయిల్ రద్దు చేయండి.. సీబీఐ కోర్టులో పిటిషన్ - raghuramakrishnaraju petetion in cbi court over cm jagan news

అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. సాక్షులను ప్రత్యక్షంగా, పరోక్షంగా జగన్ బెదిరింపులకు పాల్పడుతున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. బెయిల్ షరతులను ఉల్లంఘించిన జగన్​ను జైలుకు పంపించి సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా విచారణ వేగంగా జరపాలని రఘురామకృష్ణరాజు పిటిషన్​లో కోరారు.

mp raghurama krishna raju, cbi court, cm jagan
సీఎం జగన్, రఘురామకృష్ణరాజు, సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం
author img

By

Published : Apr 6, 2021, 10:47 PM IST

అక్రమాస్తుల కేసుల్లో నిందితుడిగా ఉన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ నర్సాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం ఇచ్చిన బెయిల్ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారని ఆయన పిటిషన్​లో ఆరోపించారు. సుమోటోగా లేదా దర్యాప్తు సంస్థ పిటిషన్​తో పాటు ఇతరుల పిటిషన్ ద్వారా కూడా బెయిల్ రద్దు చేయవచ్చునని గతంలో సుప్రీంకోర్టు, పలు హైకోర్టులు పేర్కొన్నాయని రఘురామకృష్ణరాజు అన్నారు. కాబట్టి బెయిల్ రద్దు కోసం పిటిషన్ వేసేందుకు తాను అర్హుడినేనన్నారు. సాక్షులను ప్రభావితం చేయవద్దన్న ప్రధాన షరతును జగన్ ఉల్లంఘించారని ఆరోపించారు. ఎలాంటి షరతులైనా పాటిస్తానని, విచారణకు సహకరిస్తానన్న హామీని బేఖాతరు చేశారన్నారు. చిన్న చిన్న కారణాలు చూపుతూ ఏడాదిన్నరగా విచారణకు హాజరు కావడం లేదన్నారు. చాలా మంది సాక్షులు జగన్ ప్రభుత్వంలో అధికారులుగా ఉన్నందున.. స్వేచ్ఛాయుత విచారణ ఆశించలేమని పిటిషన్​లో ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

సీఎం జగన్ బెయిల్ రద్దు చేయండి.. సీబీఐ కోర్టులో పిటిషన్

'గ్యాంగ్ ఏర్పాటైంది'

జగన్మోహన్ రెడ్డి తన సహనిందితులుకు కీలక పదవులు ఇచ్చి గ్యాంగ్​గా ఏర్పాటు చేశారని రఘురామకృష్ణరాజు పిటిషన్​లో ఆరోపించారు. విజయసాయిరెడ్డికి రాజ్యసభ సీటు ఇవ్వడంతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శిని చేశారన్నారు. మరో నిందితుడిగా ఉన్న ఆదిత్యనాథ్ దాస్​కు ఇద్దరు సీనియర్లను పక్కన పెట్టి సీఎస్ పోస్టు ఇచ్చారని ఆరోపించారు. అయోధ్యరామిరెడ్డికి రాజ్యసభ సీటు ఇచ్చారని.. ఎమ్మార్ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న ట్రైమెక్స్ ప్రసాద్​కు విజయవాడ ఎంపీ టికెట్ ఇచ్చారని ప్రస్తావించారు.

'వాళ్లకే పదవులు'

ధర్మాన ప్రసాదరావుకు ఎమ్మెల్యే, ఆయన సోదరుడికి ఉపముఖ్యమంత్రి పదవులు ఇచ్చారని రఘురామకృష్ణరాజు అన్నారు. శ్రీలక్ష్మిని తెలంగాణ నుంచి తీసుకొచ్చి అదనపు సీఎస్​ను చేశారని పిటిషన్​లో వివరించారు. శామ్యూల్​కు ప్రభుత్వ సలహాదారుడిగా కేబనెట్ ర్యాంకు ఇచ్చారన్నారు. సాక్షులు ముందుకు రాకుండా అపవిత్ర గ్యాంగు ఎంతకైనా తెగించవచ్చునని ఆరోపించారు. తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబితే ఇలాగే జరుగుతుందని హెచ్చరించేందుకు.. తనకు అనుకూలంగా పనిచేయని అధికారులను జగన్మోహన్ రెడ్డి బదిలీ చేస్తున్నారని రఘురామ ఆరోపించారు.

'ప్రజల గొంతు నొక్కుతున్నారు'

ఏపీలో జగన్ పాలన అప్రజాస్వామిక విపత్తుగా ఉందని రఘురామకృష్ణరాజు పిటిషన్​లో పేర్కొన్నారు. ఏపీ ప్రజలపై జగన్మోహన్ రెడ్డి అరాచకాలు భరించలేనంతగా ఉన్నాయని పిటిషన్​లో ప్రస్తావించారు. ప్రజల గొంతు నొక్కుతున్నారని.. అనేక మందిపై అరెస్టుల కత్తి వేలాడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో నేరాలు పెరిగిపోయాయన్నారు. ప్రభుత్వం, ఆ పార్టీ నేతలు, మద్దతుదారులు హింసకు మద్దతుగా నిలవడమే కాకుండా.. నేరుగా హింసకు పాల్పడుతున్నారని రఘురామకృష్ణరాజు ఆరోపించారు.

'తప్పుడు కేసులు పెడుతున్నారు'

రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ప్రజలు తమ నాయకులను విమర్శించే హక్కును కోల్పోయారని పేర్కొన్నారు. పోలీసులు వెన్నెముక లేని వారిగా తయారై.. ప్రభుత్వ కబంధ హస్తాల్లో పనిచేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు ప్రభుత్వానికి ఉన్న ఆటంకాలు తొలగించే కార్యకర్తల్లా మారిపోయారన్నారు. ప్రజలు మాట్లాడకుండా ఉండేందుకు తప్పుడు కేసులు పెడుతున్నారని.. ఇది సాక్షులను ప్రభావితం చేసే చర్యగా పరిగణించాలని పిటిషన్​లో రఘురామకృష్ణరాజు కోరారు.

'జగన్​ను జైలుకు పంపాలి'
ప్రజాస్వామ్యం, న్యాయవ్యవస్థ, నియంత్రణ సంస్థలపై కూడా జగన్​కు గౌరవం లేదని రఘురామకృష్ణరాజు పిటిషన్ లో ఆరోపించారు. జగన్ తోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు న్యాయమూర్తులపై మాటలతో దాడి చేస్తున్నారని.. న్యాయవ్యవస్థ స్వతంత్రత దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేల కేసులను వేగవంతం చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను జగన్ జీర్ణించుకోలేక.. న్యాయమూర్తిని లక్ష్యంగా పెట్టుకొని విపరీత ఆరోపణలు చేశారన్నారు. ముఖ్యమంత్రిగా తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని సాక్షులను ప్రభావితం చేస్తున్నందున బెయిల్ రద్దు చేయాలని రఘురామకృష్ణరాజు కోరారు. జగన్​ను జైలుకు పంపించి.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేసు విచారణ వేగంగా జరపాలని కోరారు.
ఇదీ చదవండి: ఆరోగ్యవంతమైన సమాజంతోనే అభివృద్ధి సాధ్యం: సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.