ETV Bharat / city

భాజపా నేతలకు తెరాస తత్వం బోధపడింది: రేవంత్​రెడ్డి

దుబ్బాక ఉపఎన్నికల్లో జరుగుతున్న పరిణామాలపై ఎంపీ రేవంత్​రెడ్డి స్పందించారు. గతంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడిని చెంప మీద కొడితే ఏం చేయకపోవటం వల్లే ఇప్పుడు పోలీసులు చెలరేగారన్నారు. కేంద్రంలో సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఏం చేస్తున్నారని రేవంత్​రెడ్డి ప్రశ్నించారు?

mp revanth reddy responded on dubbaka by election

author img

By

Published : Oct 27, 2020, 4:56 PM IST

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి... దుబ్బాక ఘటనపై ఎందుకు సమీక్ష చేయలేదని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఏం జరగలేదని కిషన్ రెడ్డి ఒప్పుకున్నారు కాబట్టే.... ఏం మాట్లాడలేదని ఆరోపించారు. ఈ ఘటనతో భాజపాలోని సీఎం కేసీఆర్ అనుకూల, వ్యతిరేక వర్గాలు బయటపడుతున్నాయన్నారు. భాజపా నేతలకు తెరాస తత్వం బోధపడిందన్నారు.

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ను పరామర్శించడానికి నిజామాబాద్​లో ఉన్న ఎంపీ అర్వింద్ కరీంనగర్​కు వెళ్తే... పట్టణంలోనే ఉన్న విద్యాసాగర్ రావు, మురళీధర్ రావు ఎందుకు పరామర్శించలేదని రేవంత్​రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల్లో డబ్బు పంచడం వేరు... ఇంట్లో పెట్టుకోవడం వేరని అభిప్రాయపడ్డారు. రిటర్నింగ్ అధికారిని, ఐటీ అధికారులను ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు.

భాజపా రాష్ట్ర అధ్యక్షుడిని గతంలో చెంప మీద కొడితే ఏం చేయకపోవటం వల్లే ఇప్పుడు పోలీసులు చెలరేగారన్నారు. వైసీపీ ఎంపీ రఘురామరాజుకు కేంద్రం భద్రత ఇచ్చినపుడు... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీకి భద్రత ఇచ్చేందుకు కేంద్రం ఎందుకు ఆలోచిస్తోందని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్​ను కాదని భాజపా హైకమాండ్... తెలంగాణలో ఏం చేయదని ఆరోపించారు. మంత్రి హరీశ్​రావు ప్రచారం చేస్తే శాంతి భధ్రతల సమస్యలు తలెత్తనప్పుడు... తాము వెళ్తే ఎందుకు తలెత్తుతాయని నిలదీశారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అరాచకం చేస్తున్నాడని భాజపా ఆరోపిస్తున్నప్పుడు.. కేంద్రంలో సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు?

సీఎం కేసీఆర్ ఫామ్​హౌస్ నుంచే ఎన్నికలకు పైసలు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు, అధికారులు కేసీఆర్ ఫామ్​హౌస్​ను ఎందుకు తనిఖీ చేయడం లేదని విమర్శించారు. గ్రామానికి ఇద్దరిని ఫామ్​హౌస్ రప్పించుకొని.. పైసలు ఇచ్చి పంపిస్తున్నారని రేవంత్​రెడ్డి ఆరోపించారు.

ఇదీ చూడండి: వేడెక్కిన దుబ్బాక ఉపఎన్నిక రాజకీయం... కొనసాగుతోన్న ఉద్రిక్తత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.