పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్ల మంత్రి జగదీశ్ రెడ్డి అనుసరించిన తీరు తీవ్ర అభ్యంతరకరమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ కార్యక్రమంలో మంత్రి స్థానంలో ఉండి అలా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు.
కుస్తీలు చేయాలని ఉంటే మైదానం చూయించాలని.. కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి వస్తారని పేర్కొన్నారు. అక్కడ ఎవరి బలాబలాలు ఏందో తెలుసుకుందామని అన్నారు.