ఓటుకు నోటు కేసు విచారణను అనిశా న్యాయస్థానం చేపట్టడాన్ని సవాల్ చేస్తూ ప్రధాన నిందితుడుగా ఉన్న ఎంపీ రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అనిశా అభియోగాల్లో ఎలాంటి నిజం లేదని.. ఒకవేళ పరిగణలోకి తీసుకున్నప్పటికీ... అవి అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రావని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
పబ్లిక్ సర్వెంట్‌గా తన అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు అనిశాఎక్కడా పేర్కొనలేదని... కాబట్టి అవినీతి నిరోధక చట్టం వర్తించదన్నారు. అవినీతి నిరోధక చట్టం వర్తించనప్పుడు అనిశా న్యాయస్థానం పరిధిలోకి రాదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి పిటిషన్‌పై విచారణను అనిశా కోర్టు రేపటికి వాయిదా వేసింది. ఇవాళ విచారణకు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్ సింహా, సెబాస్టియన్ హాజరయ్యారు.