జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై రఘురామ పిటిషన్‌పై ఆగస్టు 25న సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించనుంది. ఈ సందర్భంగా ఎంపీ రఘురామకృష్ణరాజు ఆనందం వ్యక్తం చేశారు. న్యాయానికి తప్పకుండా న్యాయం జరుగుతుందని అన్నారు. వాదనలన్నీ ముగిశాయి.. అతిత్వరలో తీర్పు రాబోతుందని సంతోషం వ్యక్తం చేశారు. ఏ1కు తోడుగా ఏ2 ఉండాలనేది తన ఉద్దేశమని.. ఏ2 బెయిల్ కూడా రద్దు చేయాలని పిటిషన్ వేస్తానని తెలిపారు. ఆగస్టు 25 వరకు ఏం జరుగుతుందో తవేచి చూద్దామన్నారు.
ఏంటీ పిటిషన్..
అక్రమాస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్‌పై విచారణ ముగిసింది. పిటిషన్‌పై నిర్ణయాన్ని ఆగస్టు 25కి వాయిదా వేసింది. గతంలో పలుమార్లు విచారణ జరిపిన సీబీఐ కోర్టు... సీబీఐ లిఖితపూర్వక వాదనల కోసం నేటికి వాయిదా వేసింది. దర్యాప్తు అధికారుల నుంచి ఇంకా సమాచారం అందలేదని.. మరికొంత సమయం ఇవ్వాలని సీబీఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గోపీనాథ్ కోరారు. సీబీఐ అభ్యర్థనపై రఘురామ కృష్ణరాజు తరఫు న్యాయవాది ఎస్.శ్రీవెంకటేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
సీబీఐ తరచూ వైఖరి మారుస్తోందని.. ఇప్పటికే రెండు సార్లు వాయిదా కోరిందని.. మరోసారి గడువు ఇవ్వొద్దని రఘురామ కృష్ణరాజు తరఫు న్యాయవాది కోరారు. ఇవాళే దర్యాప్తు సంస్థ తన వైఖరిని స్పష్టం చేయాలని కేసు విచారణను కొంతసేపు వాయిదా వేసింది సీబీఐ న్యాయస్థానం. పిటిషన్లోని అంశాలపై విచక్షణ మేరకే నిర్ణయం తీసుకోవాలన్న గతంలో దాఖలు చేసిన మెమోనే పరిగణనలోకి తీసుకొని ఉత్తర్వులు జారీ చేయాలని కొద్దిసేపటి తర్వాత సీబీఐ పీపీ కోర్టుకు విన్నవించారు. రఘురామ తనపై కేసులు ఉన్నాయన్న విషయాన్ని దాచిపెట్టారన్న జగన్ వాదనను పరిగణనలోకి తీసుకోవద్దని.. రఘురామ న్యాయవాది శ్రీవెంకటేష్ కోరారు. విచారణ ముగించిన సీబీఐ కోర్టు.. తీర్పును ఆగస్టు 25కి వాయిదా వేసింది.
ఇదీ చూడండి. Jagan bail cancel petition: జగన్ బెయిల్ రద్దుపై సీబీఐ కోర్టులో ముగిసిన విచారణ