MP Raghurama: తన హత్యకు కుట్ర జరుగుతోందని ఏపీ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఝార్ఖండ్‌కు చెందిన వ్యక్తులతో తనను చంపించేందుకు ప్రయత్నం జరుగుతోందన్నారు. ఐపీఎస్ అధికారి పీవీ.సునీల్ కుమార్ నుంచి తనకు ప్రాణహాని ఉందని వెల్లడించారు. ఈ మేరకు ప్రధాని మోదీకి రఘురామ లేఖ రాశారు.
"ఐపీఎస్ పీవీ.సునీల్‌కుమార్ నుంచి ప్రాణహాని ఉంది. నన్ను చంపేందుకు కుట్ర జరుగుతోంది. ఏపీలో నన్ను అరెస్టు చేయించి చంపేందుకు కుట్ర. ఇప్పటికే ఒకసారి నన్ను కస్టడీలోకి తీసుకుని హింసించారు. తప్పుడు కేసులు పెట్టి నన్ను అరెస్టు చేయాలని చూస్తున్నారు. నా హత్యకు జరుగుతున్న కుట్రపై విచారణ జరిపించాలి." - రఘురామకృష్ణరాజు, ఎంపీ
CID Notice To RRR: హైదరాబాద్‌లోని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఈనెల 12న (బుధవారం) ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులిచ్చారు. ముఖ్యమంత్రి జగన్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఎంపీ నివాసానికి వెళ్లారు. ఈనెల 17వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ముందుగా నోటీసులు తనకు ఇవ్వాలని.. రఘురామ కుమారుడు కోరగా.. ఎంపీకే నోటీసులు ఇస్తామని సీఐడీ అధికారులు స్పష్టంచేశారు. అనంతరం రఘురామకు నోటీసులు ఇచ్చి అధికారులు వెళ్లిపోయారు.
ఇదీచూడండి: MP RRR Press meet: 'అంతా ఒక్కటై రావణ రాజ్యాన్ని అంతం చేద్దాం'