ETV Bharat / city

తక్షణమే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించండి: ఎంపీ రఘురామ - ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు 2020

ఆంధ్రప్రదేశ్​లో వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని ఎంపీ రఘురామకృష్ణరాజు కోరారు. ఎలాంటి జాప్యం లేకుండా ప్రకటన విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఇసుక విధానంతో దోపిడీకి తెరలేపినట్లు తెలుస్తోందని ఆయన ఆరోపించారు.

mp-raghurama-krishnam-raju-on-local-bodies-election-in-ap
తక్షణమే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించండి: ఎంపీ రఘురామ
author img

By

Published : Nov 17, 2020, 11:01 PM IST

ఏపీలో తక్షణమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎంపీ రఘురామకృష్ణరాజు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జీహెచ్​ఎంసీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదలైన విషయాన్ని ప్రస్తావించారు. ఏపీలో ఇటీవల జరిగిన పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో మాస్క్ కూడా లేకుండా వేలాది మంది పాల్గొన్నారని పేర్కొంటూ... పలు పత్రికల్లో వచ్చిన ఫొటోలను చూపించారు. వీటిని చూసి అయినా ఎన్నికల సంఘం ఎలాంటి జాప్యం లేకుండా ఎన్నికలు నిర్వహించాలని కోరారు.

విజయనగరం మాన్సాస్ ట్రస్టు విషయంలో కోర్టులో ఎదురుదెబ్బ తగలకముందే రాష్ట్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తుల పరిరక్షణ బాధ్యతను అశోక్​గజపతిరాజుకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఇసుక విధానంలో పారదర్శకత లేదని..దోపిడీకి తెరలేపినట్లు తెలుస్తోందని ఆయన ఆరోపించారు.

ఇవీ చూడండి: గ్రేటర్​ పోరు... వందకుపైగా సీట్లు గెలిచేలా తెరాస వ్యూహాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.