RRR: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్‌ను వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు కలిశారు. వైకాపా ప్లీనరీలో ఆ పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ తీర్మానంపై ఆయన చర్చించారు. విజయసాయి రెడ్డి తీర్మానం ఇంకా తనకు అందలేదని ఎన్నికల అధికారి చెప్పారని రఘురామ అన్నారు. తీర్మానం అందాక.. ఈసీ నిర్ణయిస్తుందన్నారు.
శాశ్వత అధ్యక్షుడి పదవి అశాశ్వతం. ఇది మా పార్టీకి ఒక సెట్ బ్యాక్. భయాలు పెట్టుకుని శాశ్వత అధ్యక్షుడు కావాలని జగన్ యోచిస్తున్నారు. కానీ రాజ్యాంగం ప్రకారం శాశ్వత అధ్యక్షుడి ఎన్నిక చెల్లదు. ఇప్పటివరకు ఇలాంటి కేసు ఈసీ ముందుకు రాలేదు. ఇదీ ఈసీ, రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం. - రఘురామకృష్ణరాజు , వైకాపా ఎంపీ
ఇవీ చదవండి: