'ఉద్యోగుల్లో అభద్రతను పెంచే ప్రయత్నం చేస్తున్నారు' - కాంగ్రెస్‌పై ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ వార్తలు
పీఆర్సీపై ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు.. ఉద్యోగుల్లో అభద్రతా భావాన్ని పెంచే విధంగా ఉన్నాయని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. అంగన్వాడీ, ఆర్టీసీ, ఇతర శాఖల ఉద్యోగులకు కేసీఆర్ వేతనాలు పెంచి ఎలా మేలు చేశారో ఉద్యోగులకు తెలుసని స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ నేతలు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. పీఆర్సీపై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏవేవో మాట్లాడుతూ ఉద్యోగుల్లో అభద్రతా భావాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో ఉద్యోగులను ఎన్ని ఇబ్బందులు పెట్టిందో అందరికీ తెలుసన్నారు.
అంగన్వాడీ, ఆర్టీసీ, ఇతర శాఖల ఉద్యోగులకు కేసీఆర్ వేతనాలు పెంచి ఎలా మేలు చేశారో ఉద్యోగులకు తెలుసని స్పష్టం చేశారు. కాళేశ్వరం, మిషన్ భగీరథపై మాట్లాడే హక్కు నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి లేదన్నారు. వర్గాలుగా ఏర్పడి కొట్లాడే కాంగ్రెస్ నేతలు.. ఏనాడూ నల్గొండ జిల్లా ప్రజలను పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రానికి రావల్సిన నిధుల కోసం పోరాడతామని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: నాకోసం ఎదురు చూసేవాళ్లే గుర్తొస్తుంటారు..!