కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సిర్పూర్ మంజీరా నది నుంచి రాత్రి సమయంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని గ్రామస్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు. గ్రామస్థుల ఫిర్యాదుకు అధికారులు వెంటనే స్పందించారు. మంజీరా నది ఒడ్డున నిల్వ చేసిన 80 ఇసుక కుప్పలను సీజ్ చేసి వేలం వేయడానికి వచ్చారు. ఆ వేలంపాటలో పాల్గొనడానికి వచ్చిన వారిని ఎంపీ బీబీ పాటిల్ మనవడు వేలంపాటలో ఎవరూ పాల్గొనవద్దని, ఇసుక కుప్పలు తానే దక్కించుకుంటానని వేలంపాటలో పాల్గొనడానికి వచ్చిన వారిని బెదిరించాడు. వేలంపాటలో పాల్గొనడానికి వచ్చిన వారంతా భయపడి వెనక్కి తగ్గారు.
అక్కడున్న 80 ఇసుక కుప్పలను రూ.52,302కి బీబీ పాటిల్ మనవడితో పాటు, మరో వ్యక్తి దక్కించుకున్నాడు. రెవిన్యూ అధికారుల ముందే ఎంపీ మనవడు బెదిరింపులకు దిగినా.. అధికారులు ప్రేక్షకపాత్ర వహించారని, ఎంపీ సొంత గ్రామంలోనే అక్రమంగా ఇసుక దందా సాగుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి: కాబోయే అమ్మలూ.. కరోనా ముప్పు తప్పించుకోండిలా!