జ. మీ ఇద్దరి మధ్య కులం సంగతి అటుంచితే.. ఆస్తి, అంతస్తుల్లో వ్యత్యాసాలు ఉన్నాయని స్పష్టంగా అర్థమవుతోంది. తన భర్తతో కష్టపడుతూ కూడా మీ పెళ్లి విషయంలో మీ అమ్మ ఇంత దృఢంగా వద్దు అని చెప్పడానికి కారణాలేంటో ఆమె వైపు నుంచి కూడా ఓసారి ఆలోచించి చూడండి. అలా ఆలోచించడం వల్ల ఆమె వైపు ఉన్న భయాలు కానీ, అనుమానాలు కానీ మీకు స్పష్టమవుతాయి.
మార్పు వస్తుందేమో ప్రయత్నించండి..
అలాంటి సందర్భంలో మీరు జీవితాంతం ఒకరికొకరు అండగా ఉంటారన్న భరోసా.. అతను కలకాలం మిమ్మల్ని బాగా చూసుకుంటాడన్న నమ్మకాన్ని మీ అమ్మగారికి ఇవ్వగలరా? అన్న విషయాన్ని ఆలోచించండి. ఒకవేళ అలాంటి నమ్మకాన్ని మీ అమ్మగారికి ఇవ్వగలిగితే ఆమె ఆలోచనల్లో మార్పు వస్తుందేమో చూడండి.
బలవన్మరణంతో సాధించేదేమీ లేదు...
అలాగే ఆత్మహత్య ఆలోచనలు వచ్చాయని చెబుతున్నారు. అలాంటి ఆలోచనలు పునరావృతం అవుతుంటే వెంటనే మానసిక నిపుణులను కలవడం మంచిది. అలాంటి ఆలోచనలతో మనిషి సాధించేమీ లేదు. మీరు ఇటు అమ్మ పైన, అటు అతని పైన ప్రేమ ఉందంటున్నారు. ఇద్దరినీ అంత ప్రేమించే మీరు వాళ్ల మనసులను బాధ పెట్టే ఆలోచనలు చేయడం ఎంతవరకు సహేతుకమో ఆలోచించండి.
పరిస్థితిని అనువుగా మార్చుకోండి...
ప్రేమ ఉన్న చోట నిరాశాపూరిత ఆలోచనా ధోరణి కన్నా, సానుకూలమైన ఆలోచనా ధోరణి ఎంతో అవసరం. మీరిద్దరూ కలిసి సానుకూల దృక్పథంతో మీ అమ్మకు నచ్చజెప్పి పరిస్థితిని మీకు అనువుగా మార్చుకోవడానికి ప్రయత్నించండి.
- డా|| పద్మజ, సైకాలజిస్ట్
ఇవీ చూడండి : పుషప్‌లు చేస్తూ 81వ పుట్టినరోజు చేసుకున్న బామ్మ!