ETV Bharat / city

Corona Effect : కొవిడ్‌.. కోలుకున్నా వదలట్లేదు..! - corona updates in telangana

కొవిడ్‌.. కోలుకున్నా వదిలిపెట్టడం లేదు. నీరసం, నిస్సత్తువ, కొంచెం దూరమూ నడవలేని దుస్థితి.. కొందరిలో హఠాత్తుగా గుండెపోటు. అంతేనా! మెదడు, ఊపిరితిత్తులు, జీర్ణకోశం, కాలేయం, కిడ్నీ, చెవి, ముక్కు, గొంతు, ఎముకలు.. తదితర అవయవాలు అన్నింటిపైనా దుష్ప్రభావం పడుతోంది.  కరోనా నుంచి బయటపడడం ఊరటనిచ్చే అంశమైతే.. చికిత్సానంతర సమస్యలను ఎదుర్కోవడమే ఇప్పుడు అతి పెద్ద సవాల్‌గా మారింది.

most-of-the-people-are-suffering-from-diseases-after-recovering-from-corona
కొవిడ్‌.. కోలుకున్నా వదలట్లేదు..
author img

By

Published : Jul 13, 2021, 7:00 AM IST

కొవిడ్‌ నుంచి కోలుకున్నా ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దని ప్రఖ్యాత జీర్ణకోశ వ్యాధుల వైద్య నిపుణులు, ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ) ఛైర్మన్‌ డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డి సూచించారు. కరోనా నుంచి కోలుకున్న వారిలో దాదాపు 41.8 శాతం మంది ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్నారని ఆయన వెల్లడించారు. కొవిడ్‌ చికిత్స అనంతరం నయమైన వారిపై 30 ఏళ్ల వయసులోనే గుండెపోటు, పక్షవాతం, బ్లాక్‌ ఫంగస్‌ వంటి ప్రమాదకర వ్యాధులు దాడిచేస్తున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. మధుమేహం, కీళ్లవాతం వంటి ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్ల బారినా పడుతున్నారని తెలిపారు.

ముఖ్యంగా రెండోదశ ఉద్ధృతి అనంతరం ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయన్నారు. రెండోదశలో ప్రధానంగా డెల్టా వేరియంట్‌ 90 శాతం ప్రభావం చూపిందనీ, డెల్టా ప్లస్‌ కేసులు ఇప్పటి వరకూ తెలంగాణలో 2, ఏపీలో 2 మాత్రమే నమోదయ్యాయని ఆయన పేర్కొన్నారు. కొవిడ్‌ అనంతర సమస్యలకు సత్వరమే చికిత్స అందించకపోతే.. కొన్నిసార్లు ప్రాణాపాయ పరిస్థితులు ఎదురుకావచ్చని డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి హెచ్చరించారు. అందుకే వీరి కోసం ‘ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)’లో ప్రత్యేక ఓపీ చికిత్సలను ప్రారంభించినట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్యకార్యదర్శి నర్సింగరావుతో కలిసి ‘పోస్ట్‌ కొవిడ్‌ క్లినిక్‌’లను ఆయన ప్రారంభించారు.

ఏఐజీ ఛైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి

దేశంలో తొలిసర్వే

‘‘దేశంలోనే మొదటిసారిగా కొవిడ్‌ చికిత్సానంతర సమస్యలపై ఆన్‌లైన్‌ సర్వే నిర్వహించాం. 5,347 మంది ఇందులో పాల్గొన్నారు. ప్రశ్నలకు 2038 మంది స్పందించారు. వీరిచ్చిన సమాచారం ఆధారంగా వైద్య అధ్యయన పత్రాన్ని రూపొందించాం. దాన్ని ఇటీవలే ప్రఖ్యాత వైద్యపత్రిక లాన్సెట్‌కు పంపించాం. త్వరలోనే అది ప్రచురితమవుతుంది."

- డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డి, ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ) ఛైర్మన్‌

ముఖ్యాంశాలు..

  • కొవిడ్‌ నుంచి కోలుకోవడానికి దాదాపు 48 శాతం మందికి 1-3 నెలల సమయం పట్టగా.. 34 శాతం మందికి 3 నెలలు దాటింది. 18 శాతం మంది నెలరోజుల్లోనే స్వస్థత పొందారు.
  • వీరిలో 38 శాతం మంది ఆసుపత్రిలో చికిత్స పొందగా.. ఆక్సిజన్‌ సేవలు అవసరమైన వారు 34.28 శాతం మంది. అంటే దాదాపు మూడో వంతు మందికి ప్రాణవాయు సేవలు అవసరమయ్యాయి.
  • ఆసుపత్రిలో చికిత్స పొందినవారిలో 75 శాతం మంది స్టెరాయిడ్‌ ఔషధాలను వాడారు. మూడింట రెండోవంతు మందికి వాటిని ఇచ్చారు. వీరిలో ఆక్సిజన్‌ అవసరమైనవారు 56.5 శాతం మంది. అంటే ఆక్సిజన్‌ అవసరం లేని వారికీ స్టెరాయిడ్‌ ఔషధాలను ఇచ్చారు. 1.73 శాతం మంది ఇప్పటికీ వాటిని వినియోగిస్తున్నారు.
  • వీరిలో అత్యధికులు నీరసం, నిస్సత్తువ(64.15 శాతం),ఒళ్లునొప్పులు(31శాతం)తో బాధపడ్డారు.
  • ఆసుపత్రిలో చేరి కోలుకున్న వారిలో 48 శాతం మందిలో ఏదో ఒక అనారోగ్య సమస్య తలెత్తింది. అదే ఆసుపత్రిలో చేరకుండా కోలుకున్న వారిలో 37.6 శాతం మందిలో ఏదో ఒక సమస్య కనిపించింది.
  • 6 శాతం మంది ఏదో ఒక అనారోగ్య లక్షణాలతో తిరిగి ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది.
  • కొవిడ్‌ చికిత్స అనంతరం సమస్యలపై సరైన రీతిలో చికిత్స పొందలేదని దాదాపు 40 శాతం మంది చెప్పారు.
  • కొవిడ్‌కు ఆక్సిజన్‌ చికిత్స, స్టెరాయిడ్‌ ఔషధాలను వినియోగించిన వారిలో అత్యధికులకు తదనంతర సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి’’ అని డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి వివరించారు.

స్వీయ క్రమశిక్షణ ముఖ్యం

దేశవ్యాప్తంగా కొవిడ్‌ చికిత్స సమాచారాన్ని పరస్పరం ఇచ్చి పుచ్చుకోవాలి. ప్రజల్లోనూ చికిత్సానంతర సమస్యలపై అవగాహన కల్పించాలి. కొవిడ్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రజలు వ్యక్తిగత క్రమశిక్షణను పాటించాలి. ప్రభుత్వ వైద్యంలోనూ కొవిడ్‌ చికిత్సానంతర సమస్యలకు సేవలందించడానికి సర్కారు ఏర్పాట్లు చేస్తోంది.

-నర్సింగరావు, సీఎం ముఖ్యకార్యదర్శి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.