ఏపీలో 4 దశల్లో నిర్వహించే పంచాయతీ ఎన్నికల్లో 2,77,17,784 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వివిధ కారణాలతో పలు జిల్లాల్లో కొన్ని పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడం లేదు. 13,371 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించవచ్చని కలెక్టర్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కలెక్టర్లతో ఎన్నికల కమిషనరు బుధవారం నిర్వహించే వీడియో సమావేశంలో అధికారులు ఇదే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నారు. వీటిని ఎన్నికల కమిషనరు పరిశీలించి తదుపరి ఆదేశాలిస్తారు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని పంచాయతీల్లోనే అత్యధికంగా 32,52,069 మంది ఓటర్లు ఉన్నారు. 25,35,500 ఓటర్లతో రెండో స్థానంలో గుంటూరు, 23,98,182 ఓటర్లతో మూడో స్థానంలో పశ్చిమ గోదావరి ఉన్నాయి.
- ఇదీ చదవండి : భాగ్యనగరంలో మరో లాజిస్టిక్ పార్కు సిద్ధం