రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లాక్‌డౌన్ నిబంధనలను పలువురు వాహనదారులు పెద్ద ఎత్తున ఉల్లంఘిస్తున్నారు. రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. నిబంధనలు పాటించకుండా రోడ్డెక్కుతున్న వాహనదారులపై కేసులు నమోదు చేసి వారి వాహనాలను జప్తు చేస్తున్నా.. పరిస్థితిలో మార్పు రావడం లేదు.
మే 12 నుంచి జులై 8 వరకు లాక్‌డౌన్ నిబంధనలు పాటించని వారిపై ఏకంగా 64,811 కేసులు నమోదయ్యాయి. మాస్కులు ధరించని వారిపై 23,475 కేసులు నమోదు చేయగా... 22,092 వాహనాలు జప్తు చేశారు. ఎటువంటి అనుమతులు, పాస్‌లు లేకుండా రోడ్లపైకి వచ్చే వారిని ఉపేక్షించేది లేదని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇవీచూడండి: లాక్‌డౌన్ పొడిగింపుపై కేబినెట్ భేటీ