Mohanbabu Meet Chandrababu: ప్రముఖ సినీనటుడు మోహన్‌బాబు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తెదేపా అధినేత చంద్రబాబు నివాసానికి వెళ్లారు. చంద్రబాబుతో దాదాపు గంటకు పైగా సమావేశం కొనసాగింది. చాలా కాలం తర్వాత చంద్రబాబు ఇంటికి మోహన్‌బాబు రావడం హాట్ టాపిక్‌గా మారింది.
తాజా రాజకీయాలపై ఇద్దరూ ఏం చర్చించుకున్నారన్న దానిపై ఆసక్తి నెలకొంది. మోహన్ బాబు మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ సినీ, రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. వీరిద్దరి భేటీ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మోహన్ బాబు రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తారనే ప్రచారం జోరందుకుంది.