మేడ్చల్ జిల్లా నాచారంలో ఆటో యూనియన్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఆటో కార్మికులకు, నిరుపేదలకు రైతు సమితి అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పలువురు తెరాస నాయకులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ పేద ప్రజలకు తమవంతు సాయం చేయడం చాలా సంతోషంగా ఉందని... పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. లాక్డౌన్ పూర్తయ్యేవరకూ ప్రజలందరూ ఇళ్లలోంచి బయటకు రాకూడదని తెలిపారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో మరో 13 కరోనా పాజిటివ్ కేసులు