కూకట్పల్లి నియోజకవర్గంలోని బాలాజీ నగర్ డివిజన్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. కాలనీవాసులతో మాట్లాడి కనీస శుభ్రత పాటించాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలోని అన్ని కాలనీల్లో రసాయనాన్ని పిచికారి చేశామన్నారు. ఇంకా ఏ ప్రాంతంలోనైనా స్ప్రే చేయని పక్షంలో.. తనకు గానీ, పారిశుద్ధ్య సిబ్బందికి గానీ తెలియజేయాలని సూచించారు. నియోజకవర్గంలోని అన్ని ప్రధాన రహదారులతో పాటు.. కాలనీల్లో వైరస్ నిర్మూలనకు చర్యలు చేపట్టామని తెలిపారు.
ఇవీ చూడండి: బ్యాంకుల విలీనంతో ఖాతాదారులు ఇలా చేయండి!