ప్రజాప్రతినిధులు నిత్యం బిజీగా గడుపుతుంటారు. ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ... వారితో మమేకవుతుంటారు. సందర్భానుసారం వ్యవహరిస్తుంటారు. ఓ ప్రభుత్వ కార్యక్రమానికి వచ్చిన నగరి ఎమ్మెల్యే డప్పు వాయించారు. స్వయంగా ఎమ్మెల్యేనే దరువు వాయించగా... డప్పు కళాకారులు ఆనందం వ్యక్తం చేశారు. ఏపీ చిత్తూరు జిల్లా పుత్తూరు మండల పరిషత్ కార్యాలయంలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమానికి ఎమ్మెల్యే రోజా హాజరయ్యారు.
తల్లి పాల ఆవశ్యకతను వివరించారు. తల్లి పాల సంస్కృతిని రక్షించుకుందామని ఎమ్మెల్యే రోజా సూచించారు. అనంతరం డప్పు కళాకారులకు నూతన డప్పులు అందజేశారు. అక్కడే వారితో కలిసి ఆమె డప్పు కొట్టి అలరించారు. రోజా ఉత్సాహం చూసి... కళాకారులు పాదం కదిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానికులు హాజరయ్యారు.
ఇవీ చూడండి: