పౌరసత్వ చట్టాల గురించి ముస్లింలు ఎవరూ భయపడాల్సిన అవసరమే లేదని భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. భయపడాల్సిన అవసరం లేనప్పుడు చర్చ ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రజలను ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని రాజాసింగ్ ఆరోపించారు. ఆ వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగించాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సభాపతిని కోరారు.
2011లో పౌరసత్వ చట్టాలను ఎవరూ వ్యతిరేకించలేదని, భాజపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్పీఆర్, ఎన్ఆర్సీ, సీఏఏలపై కొన్ని రాజకీయ పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.
సీఏఏ తీర్మాన చర్చలో మాట్లాడిన అసత్యాలు వెనక్కి తీసుకోవాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. మైక్ కట్ చేయడం వల్ల పోడియం వద్దకు వెళ్లి ఆందోళన నిర్వహించారు. తీర్మాన పత్రాన్ని చించివేసి నినాదాలు చేశారు. రాజాసింగ్ తన స్థానానికి వెళ్లి మాట్లాడాలని సీఎం సూచించారు. అన్ని పార్టీల సభ్యులు చెప్పిన విషయాలు విన్నానని తెలిపారు. తీర్మానాన్ని ఆమోదించాలని స్పీకర్‌ను సీఎం కోరారు.
- ఇవీ చూడండి:నాలుగు బిల్లులకు శాసనసభ ఏకగ్రీవ ఆమోదం