ఏపీలోని విశాఖజిల్లా అరకులో జరిగిన ప్రమాద బాధిత కుటుంబానికి అండగా ఉంటామని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. షేక్‌పేటలో బాధిత కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. హైదరాబాద్ నుంచి ఐదుగురు కుటుంబ సభ్యులను ఇవాళ ఉదయం విశాఖపట్నం పంపించేందుకు ఏర్పాట్లు చేశామని అన్నారు.
ఉదయం 5.30 నిమిషాలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి వారు బయల్దేరతారని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయమని తెలిపారని వివరించారు.
ఇదీ చూడండి : అరకు ఘాట్‌రోడ్డులో పర్యటకుల బస్సు బోల్తా.. నలుగురు మృతి