ETV Bharat / city

కేటీఆర్‌ ఆదేశించారు.. ఎమ్మెల్యే ఆదుకున్నారు. - ఎమ్మెల్యే మాగంటి గోపినాధ్‌ సహయం

నిరుపేద కుటుంబం, ఆపై లాక్‌డౌన్‌.. ఇంతలోనే భార్య మృతి. ఈ పరిస్థితులు ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాయి. ఇద్దరు చిన్న పిల్లలతో ఆ తండ్రి పడుతున్న అవస్థలను ట్విటర్‌ ద్వారా మంత్రి కేటీఆర్‌కు తెలిపాడు స్థానికుడు. స్పందించిన మంత్రి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్​ను ఆదేశించారు. తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే ఆ కుటుంబాన్ని పరామర్శించి.. నిత్యావసరాలతో పాటు ఆర్థిక సాయం చేశారు.

mla maganti gopinath
కేటీఆర్‌ ఆదేశించారు.. ఎమ్మెల్యే ఆదుకున్నారు.
author img

By

Published : Apr 17, 2020, 3:22 PM IST

Updated : Apr 17, 2020, 3:29 PM IST

ఎర్రగడ్డలోని ప్రేమ్‌నగర్‌లో కాలనీలో ఒక నిరుపేద కుటుంబానికి చెందిన మహిళ ఇటీవల మృతి చెందింది. ఆమెకు ఇద్దరు చిన్న పిల్లలున్నారు. భార్య మృతి, లాక్‌డౌన్‌ కారణంగా ఆ కుటుంబం పడుతున్న ఇబ్బందులను స్థానిక వ్యక్తి మంత్రి కేటీఆర్‌కు ట్విటర్‌ ద్వారా వివరించాడు. స్పందించిన మంత్రి.. కుటుంబాన్ని ఆదుకోవాలని జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్​ను ఆదేశించారు.

తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే.. ఆ కుటుంబాన్ని పరామర్శించారు. పిల్లలకు కావాల్సిన పాలు, బిస్కెట్లు, బియ్యం, నిత్యావసర వస్తువులతో పాటు ఆర్థిక సాయం అందించారు. వారికి ఇంకా ఏమైనా సాయం కావాలంటే కూడా.. నా వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భరోసా ఇచ్చారు.

ఎమ్మెల్యే స్పందనకు మంత్రి కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు.

కేటీఆర్‌ ఆదేశించారు.. ఎమ్మెల్యే ఆదుకున్నారు.

ఇదీ చదవండి: లాక్​డౌన్ 2.0​ రూల్స్​లో మార్పు- ఇక ఈ పనులు చేయొచ్చు

Last Updated : Apr 17, 2020, 3:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.