వైఎస్ వివేకా హత్య కేసులో(YS Viveka murder case) వెనక ఉందెవరన్నది ఏపీ ముఖ్యమంత్రి జగన్(AP CM JAGAN) నిగ్గు తేల్చాలని తెలుగుదేశం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు. ఇంటి దొంగలు, కుటుంబ సభ్యుల ప్రమేయం ఉన్నందునే.. సీఎం జగన్ ఆ కేసును పక్కదారి పట్టించారని ఆయన ఆరోపించారు.
తెదేపా అధికారంలో ఉన్నప్పుడు సీబీఐ(CBI) విచారణ వేశామని.. వైకాపా(YSRCP) అధికారంలోకి వచ్చాక దోషుల్ని నిర్థారించడంలో విఫలమైందని విమర్శించారు. ప్రతి పక్షాల అణిచివేత మీద ఉన్న శ్రద్ధ.. బాబాయి హత్య కేసు విచారణపై ఎందుకు లేదని అన్నారు. వివేకా హత్య కేసులో (YS Viveka murder case) నేరస్థుల్ని శిక్షించాలని గోరంట్ల బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు.
వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి సంచలన విషయాలు
ఇటీవల వైఎస్ వివేకా హత్యకు(YS Viveka murder case) సంబంధించి మాజీ డ్రైవర్ దస్తగిరి(driver dastagiri) పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు. హత్య జరిగిన విధానం, కారణాలు, వారి పేర్లను ప్రస్తావిస్తూ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. వివేకా వద్ద 2017, 2018 సంవత్సరాల్లో డ్రైవర్‌గా పనిచేసినట్లు తెలిపారు. హత్య జరిగిన విధానంపై పోలీసులకు పూసగుచ్చినట్లు డ్రైవర్ దస్తగిరి వివరించారు.
ఇదీ చదవండి: