ETV Bharat / city

Mirchi farmer : మిర్చి రైతుకు కంప్యూటర్‌ మిత్రుడు.. - telangana news

Mirchi farmer : స్మార్ట్ ఫోన్‌ వినియోగమే తెలియని పల్లెటూరి రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సేద్యాన్ని అలవోకగా చేసేస్తున్నారు. తక్కువ నీటినే సమర్థంగా ఉపయోగిస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు. ఉన్నత విద్యా సంస్థలను వ్యవసాయ క్షేత్రాలతో అనుసంధానం చేస్తే దిగుబడులు ఎలా పెరుగుతాయో నిరూపిస్తున్నారు.

Mirchi farmer, farmer technology
మిర్చి రైతుకు కంప్యూటర్‌ మిత్రుడు
author img

By

Published : Feb 13, 2022, 11:40 AM IST

Mirchi farmer : పొలంతో కళాశాలకు స్నేహం కుదిరింది. నాగలి, కంప్యూటర్‌ కలిసి పనిచేస్తున్నాయి. రైతుల వ్యవసాయ క్షేత్రమే విద్యార్థుల కార్యశాలగా మారిపోయింది. ఫలితంగా ఊహకందని ఫలితాలు కళ్లను గోచరిస్తున్నాయి.

విద్యార్థులు క్షేత్రస్థాయిలో పర్యటించి, ప్రజల సమస్యలపై ప్రాజెక్టు రిపోర్టు సమర్పిస్తే గుంటూరు జిల్లాలోని కేఎల్‌ వర్సిటీ 40 క్రెడిట్‌ పాయింట్లు కేటాయిస్తుంది. అందులో భాగంగా పల్నాడు ప్రాంతంలో కంప్యూటర్‌ సైన్సు విభాగం(సీఎస్‌ఈ) విద్యార్థులు పర్యటించారు.

ఇదీ గుర్తించారు

ఇక్కడ అనాదిగా మిర్చి సాగవుతోంది. రైతులు సాగునీటి కొరతతో అల్లాడుతున్నారు. అదే సమయంలో నీటి యాజమాన్య పద్ధతులు తెలియక బోలెడు నీటిని వృథా చేసుకుంటూ నష్టపోతున్నారని గ్రహించారు.

విద్యార్థుల చొరవ

నీటి వృథాకు సెన్సర్లతో అడ్డుకట్ట వేయొచ్చని విద్యార్థులకు అధ్యాపకులు సూచించారు. పరిమిత నీటితో మిర్చిని బిందుసేద్యం పద్ధతుల్లో సాగు చేసుకుంటే నీటి సమస్యే ఉత్పన్నం కాదని అగ్రికల్చర్‌ విభాగమూ సూచించింది. వెంటనే కంప్యూటర్‌ సైన్సు విభాగం ప్రధానాచార్యులు ఆచార్య సుబ్రహ్మణ్యం సమగ్ర నివేదిక తయారుచేసి దిల్లీలోని డిపార్టుమెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ(డీఎస్‌టీ)కి పంపించారు.

దారి చూపిన నివేదిక

గుంటూరు జిల్లాలో ఏడాదికి సగటున 1,300 మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తుంది. అది పల్నాడులో 700 మిల్లీమీటర్లే. ఇక్కడ దొరికే పరిమిత నీటితో వ్యవసాయం చేయాలంటే బిందు, సెన్సర్‌ పరిజ్ఞానం వినియోగం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని నివేదికలో పేర్కొన్నారు. రైతులను ముఖ్యంగా ఎస్సీలను సమూహంగా ఏర్పాటుచేసి, అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం నేర్పించి, సహకార వ్యవసాయం చేయిస్తామన్నారు. దీనికి డీఎస్‌టీ మెచ్చుకుని 2021 జనవరిలో ప్రాజెక్టు మంజూరు చేసి రూ.1.03 కోట్లు కేటాయించింది. ప్రొఫెసర్లు నాగమల్లీశ్వరి, సంజీవయ్య, జేఆర్‌ఎఫ్‌(జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో) వైశాలి ప్రాజెక్టులో భాగస్వాములయ్యారు.

మిర్చి మిత్ర యాప్‌

పిడుగురాళ్ల మండలం గుత్తికొండలో బోరు సదుపాయమున్న 48 మంది ఎస్సీ రైతులను ఎంపిక చేశారు. వారికున్న 24 ఎకరాల్లో వినూత్న సాగు ప్రారంభించారు. ఒక్కో లబ్ధిదారుడికి చెందిన అర ఎకరంలో సాగుకు మాత్రమే సహకారమందిస్తున్నారు. వీరికి సాయం చేసేందుకు మిర్చిమిత్ర అనే యాప్‌ను వర్సిటీ తయారు చేసింది. దాన్ని రైతుల మొబైల్‌లో డౌన్‌లోడ్‌ చేసి, ఎలా చూడాలో నేర్పించారు. పొలాల్లో సెన్సర్లు అమర్చారు. భూమిలో తేమ శాతం తగ్గినా, పొలంలో నీళ్లు నిండినా రైతుల ఫోన్‌కు ఒక రకమైన శబ్ధం వస్తుంది. వెంటనే రైతు అప్రమత్తమవుతాడు. చీడపీడల నివారణకు వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా చెప్పిస్తూ మందులను సమకూర్చారు. సేద్యానికి అనువుగా తొలుత భూపరీక్షలు చేయించారు. ఫాలోఅప్‌ చేస్తుండటంతో ఊహించని ఫలితాలు వచ్చాయి.

మా పంట సూపర్‌

సహకార సేద్యం చేస్తున్న వారిలో ఇద్దరు రైతులు కోటేశ్వరరావు, రుచితలు మాట్లాడుతూ... ‘ఈసారి మిర్చి పంటకు దేశవ్యాప్తంగా తెగుళ్లు ఆశించి, రైతులు తీవ్రంగా నష్టపోయారు. మాకు మాత్రం మంచి దిగుబడులు వస్తున్నాయి. కారం తయారీకి గ్రైండర్లు ఇచ్చారు. మాకు ఈ సేద్యం చాలా ప్రయోజనకరంగా ఉంది’ అని అన్నారు.

మరో మూడు గ్రామాలకు చేయూత

.

గుత్తికొండలో ఫలితాలు బాగుండటంతో... జూలకల్లు, కరాలపాడు, జానపాడు గ్రామాలకు చెందిన 52 మంది రైతులతోనూ సహకార సేద్యం చేయించాలని నిర్ణయించాం. వర్సిటీ తరఫున ముగ్గురు టెక్నికల్‌ ఉద్యోగులను నియమించాం. రైతులకు క్షేత్రస్థాయిలోనే అన్ని రకాలుగా శిక్షణ ఇస్తున్నాం. పంటను కారం చేసి విక్రయించుకోవటానికి గ్రైండర్లనూ సరఫరా చేశాం. ‘పల్నాడు మిర్చి’ పేరుతో ఒక బ్రాండ్‌ ఏర్పాటు చేసి త్వరలో ఎగుమతులు చేసేలా సహకారమందిస్తాం.

-- డాక్టర్‌ సుబ్రహ్మణ్యం, ప్రాజెక్టు ప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్‌, కేఎల్‌ వర్సిటీ

ఇదీ చదవండి: Covid cases in India: 50వేల దిగువకు రోజువారీ కరోనా​ కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.