తల్లిదండ్రులకు తమ పిల్లల కంటే మరేదీ ఎక్కువ కాదని గ్రహించలేకపోయాడేమో ఆ అబ్బాయి(Minor boy suicide). కడుపున పుట్టిన బిడ్డల కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెడతారన్న సంగతి మర్చిపోయాడేమో. వారు క్షేమంగా ఉండటం కోసం ఏమైనా చేస్తారని ఊహించలేకపోయాడేమో. పిల్లలు లేకపోతే వారి జీవితం వ్యర్థం అని తెలుసులేకపోయాడేమో. అందుకే ఆ తల్లిదండ్రులకు పుత్రశోకం(Minor boy suicide) మిగులుస్తూ ఆత్మహత్య చేసుకున్నాడు. హార్ట్‌లో సమస్య ఉందని.. ఆర్థికంగా కన్నవాళ్లను ఇబ్బంది పెట్టలేక బలవన్మరణం చెందాడు.
సూసైడ్ నోట్
'అమ్మానాన్న.. నన్ను క్షమించండి. నాకు హార్ట్‌లో ప్రాబ్లమ్ ఉంది. వైద్యం ఖర్చుల కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను(Minor boy suicide). మీరంటే నాకు చాలా ఇష్టం. నా ఫోన్ అమ్మండి. ఆ వచ్చిన డబ్బుతోనే అంత్యక్రియలు నిర్వహించండి.' అంటూ ఓ పదిహేడేళ్ల బాలుడు ఆత్మహత్యకు ముందు రాసి పెట్టిన లేఖ. చిన్న వయసులోనే గుండెలో(Minor boy suicide) సమస్య ఉందని వైద్యులు చెప్పడంతో ఆర్థిక సమస్యల కారణంగా.. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టలేక ఆత్మహత్య చేసుకున్నాడు ఓ బాలుడు. హైదరాబాద్ పాత బస్తీలోని బహదూర్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఫోన్ అమ్మండి
కిషన్ బాగ్ ప్రాంతానికి చెందిన పవన్‌కు(17).. హార్ట్‌లో సమస్య ఉందని వైద్యులు చెప్పారు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియదని సమాచారం. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య(Minor boy suicide) చేసుకున్నాడు. తన తల్లిని ఇబ్బందిని పెట్టడం ఇష్టం లేక బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. అంత్యక్రియల కోసం తన ఫోన్ అమ్మాలని లేఖలో పేర్కొన్నాడు.
కేసు నమోదు
కుమారుడిని ఆ స్థితిలో చూసిన ఆ తల్లి.. గుండెలవిసేలా(Minor boy suicide) రోదించడం స్థానికులను కలచివేసింది. సమాచారం అందుకున్న బహదూర్‌పురా పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై కుటుంబసభ్యులను అడిగి తెలుసుకుంటున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: son attack on father: కన్నతండ్రిపై కత్తితో దాడి... కారణం అదేనా..?