తెలంగాణ సిద్ధాంతకర్తగా, ఉద్యమ స్ఫూర్తి ప్రదాతగా రాష్ట్ర ప్రజల గుండెల్లో ఆచార్య జయశంకర్ శాశ్వతంగా నిలిచారని రాష్ట్ర మంత్రులు శ్రీనివాసగౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జయశంకర్ 86వ జయంతి సందర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు.
ఉద్యమ సమయంలో కేసీఆర్‌కు సలహాలు, సూచనలు ఇస్తూ వెన్నంటే నిలిచారని గుర్తుచేసుకున్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా తెలంగాణను దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా కేసీఆర్ నిలిపారని శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, టీజీవో నాయకులు విష్ణువర్ధన్ రావు, నిరంజన్ రెడ్డి, రవీందర్రావులు పాల్గొన్నారు.
ఇవీచూడండి: జయశంకర్ ఆశయ సాధనకు పునరంకితం: సీఎం కేసీఆర్