వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో పురోగతి సాధించిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. రాబోయే సంవత్సరం కాలంలో రాష్ట్రంలో ఆయకట్టు ప్రాంతం పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అబ్దుల్లాపూర్ మెట్ మండలం కొహెడ వ్యవసాయ మార్కెట్‌లో మామిడిపండ్ల విక్రయ కేంద్రం ఏర్పాటు చేయడానికి జరుగుతున్న తాత్కలిక పనులను.. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ ఛైర్మన్ వీరమళ్ల రామ్నర్సింహగౌడ్తో కలిసి పరిశీలించారు.
లాక్‌డౌన్ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. ఈ మామిడి సీజన్‌లో కొహెడ మార్కెట్ యార్డ్‌లో విక్రయాలు ప్రారంభిస్తామన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పనులన్నీ తాత్కలిమేనని స్పష్టం చేశారు. త్వరలోనే శాశ్వత నిర్మాణాలు చేపట్టి ఆసియాలోనే అతి పెద్ద మోడల్ మార్కెట్‌గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో 40 లక్షల ఎకరాల్లో వరి సాగు, 5.92 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 4.50 లక్షల ఎకరాల్లో పండ్ల తోటలు సాగులో ఉన్నాయని చెప్పారు.
ఇది చదవండి: ఈటీవీ కథనానికి స్పందన.. బుడగ జంగాల కూలీలకు సాయం