ETV Bharat / city

VISWAROOP: 'కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వరా.. మంత్రిని నిలదీసిన బాధితులు" - కోనసీమ జిల్లా తాజా వార్తలు

VISWAROOP: ఏపీ మంత్రి పినిపే విశ్వరూప్​పై వరద బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ఉన్న శ్రద్ధ.. ఇలాంటి సమయంలో కనబడదా అని నిలదీశారు. మూడు రోజులుగా వరద నీటిలో నానుతున్నామని.. కనీసం మంచినీళ్లు అయిన సక్రమంగా పంపిణీ చేయలేదని బాధితులు మంత్రిని నిలదీశారు.

VISWAROOP
VISWAROOP
author img

By

Published : Jul 17, 2022, 5:34 PM IST

VISWAROOP: కోనసీమ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతమైన లంకల గన్నవరం గ్రామాన్ని సందర్శించిన ఏపీ మంత్రి విశ్వరూప్‌పై వరద బాధితులు మండిపడ్డారు. ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ఉన్న శ్రద్ధ ఇలాంటి సమయంలో కనపడదా అని నిలదీశారు. మూడు రోజులుగా వరద నీటిలో నానుతున్నా కనీసం మంచినీళ్లు కూడా పంపిణీ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు, వృద్ధులు తిండి లేక అల్లాడుతున్నారని వాపోయారు. తక్షణమే ఈ గ్రామానికి 6 వేల ఆహార పొట్లాలు అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మంత్రి విశ్వరూప్‌, స్థానిక ఎమ్మెల్యే చిట్టిబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.

Flood effect: మహోగ్ర గోదావరి.. మూడు దశాబ్ధాల తర్వాత లంక గ్రామాల ప్రజల్ని బిక్కుబిక్కుమనేలా చేస్తోంది. ప్రతి ఏడాది వరదలానే భావించి అక్కడే ఉండిపోయిన లంకవాసులు ప్రస్తుత గోదావరి ఉద్ధృతికి తేరుకుని బయటికి రాలేక.. సర్వం కోల్పోయారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం కాట్రేనికోన, ఐ. పోలవరం, తాళ్లరేవు మండలాల్లోని లంక గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఇంటిలోని వస్తువులను వరద నీటి నుంచి కాపాడుకునేందుకు నానాఅవస్థలు పడుతున్నారు. పాడి పశువుల్ని ప్రాణాలతో దక్కించుకునేందుకు తీవ్ర కష్టాలు పడుతున్నారు. గూడుచెదిన వారంతా గుడారాల్లోనూ.. కింది అంతస్తు మునిగిన వారంతా.. డాబాల మీదకు చేరి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు.

గోదావరి వరద ముంపులో కోనసీమ లంక గ్రామాలు విలవిల్లాడుతున్నాయి. వరదల కారణంగా జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎల్‌.గన్నవరంలో ఇళ్లన్నీ మునిగిపోయాయి. డాబాలపైకి చేరిన జనం రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. వరద నుంచి బయటపడే మార్గం లేక.. తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు పడవలు కూడా రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

'కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వరా.. మంత్రిపై బాధితుల ఆగ్రహం'

అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని లంక గ్రామాల్లో.. పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట మండలాల్లోని లంక గ్రామాల్లో కూరగాయలు, అరటి, కంద పంటలు నాలుగు రోజులుగా నీటిలోనే నానుతున్నాయి. కూరగాయల పంటలు పూర్తిగా పాడైపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోనసీమ జిల్లాలో గోదావరి వరద ఉద్ధృతి ఇంకా కొనసాగుతోంది. పి.గన్నవరం అక్విడెక్టులోకి వరద నీరు పోటెత్తోంది. వరద ఉద్ధృతికి గంటి నుంచి చాకలిపాలెం వరకు ఆర్ అండ్ బీ ప్రధాన రహదారి మొత్తం జలమయం అయ్యింది. వరద నీరు పొంగిపోతుండడంతో.. కోనసీమ జిల్లా వ్యాప్తంగా 51 లంక గ్రామాల ప్రజలు అల్లాడుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.