ETV Bharat / city

'హౌసింగ్ బోర్డు ఆస్తులపై వారంలోగా నివేదిక ఇవ్వండి' - వేముల ప్రశాంత్ రెడ్డి వార్తలు

హౌసింగ్ బోర్డు ద్వారా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం, ఆస్తుల నిర్వహణకు అవుతున్న ఖర్చు వివరాలను అందించాలని అధికారులను మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఆదేశించారు. ఆస్తులకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నివేదికను ముఖ్యమంత్రికి సమర్పిస్తామని పేర్కొన్నారు. వాటి ఆధారంగా నిరర్ధక ఆస్తులపై ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాన్ని అమలు చేయాల్సి ఉంటుందని మంత్రి ప్రశాంత్ రెడ్డి చెప్పారు. హౌసింగ్ బోర్డు ఆస్తులపై మంత్రి సమీక్ష నిర్వహించారు.

vemula prasanth reddy
vemula prasanth reddy
author img

By

Published : Sep 28, 2020, 5:15 PM IST

గృహనిర్మాణ సంస్థ ఆస్తులపై వారం రోజుల్లోపు సవివర నివేదిక సమర్పించాలని అధికారులను గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. హౌసింగ్ బోర్డు ఆస్తులపై మంత్రి సమీక్ష నిర్వహించారు. భూములు, ప్లాట్లు, భవనాలు, కార్యాలయాల స్థలాలు, వాణిజ్య స్థలాలు తదితర కాలనీల వారిగా విభజించి వివరాలు అందించాలని స్పష్టం చేశారు.

ప్రణాళికలు సిద్ధం చేయండి

స్థలాలను అనుభవిస్తున్నవారు, విస్తీర్ణం, వాటి విలువ, వాటి ప్రస్తుత పరిస్థితిపై పూర్తి జాబితా - ఇన్వెంటరీ తయారు చేయాలని మంత్రి పేర్కొన్నారు. ఆస్తుల్లో నిరర్ధకమైనవి, ఉపయోగిస్తున్న వాటి వివరాలు కూడా సమగ్రంగా అందించాలని సూచించారు. ఆస్తులపై కోర్టు కేసులు ఉంటే త్వరితగతిన తేల్చేలా హౌసింగ్ బోర్డ్ ప్రణాళిక సిద్ధం చేయాలని ప్రశాంత్ రెడ్డి చెప్పారు.

సీఎంకు నివేదిక

బోర్డు ద్వారా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం, ఆస్తుల నిర్వహణకు అవుతున్న ఖర్చు వివరాలు అందించాలన్నారు. హౌసింగ్ బోర్డ్ ఆస్తుల ద్వారా ప్రభుత్వ ఆదాయం పెంచేలా స్పష్టమైన ప్రణాళిక తయారుచేయాలని తెలిపారు. ఆస్తులకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నివేదికను ముఖ్యమంత్రికి సమర్పిస్తామని పేర్కొన్నారు. వాటి ఆధారంగా నిరర్ధక ఆస్తులపై ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాన్ని అమలు చేయాల్సి ఉంటుందని మంత్రి ప్రశాంత్ రెడ్డి చెప్పారు.

ఇదీ చదవండి : 'జంతు సంరక్షణకు ముందుకొచ్చే సంస్థలకు ప్రభుత్వ సహకారం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.